Tadipatri : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. తగ్గని ఉద్రిక్తత!

తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

New Update
Tadipatri : తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. తగ్గని ఉద్రిక్తత!

High Tension In AP : తాడిపత్రి(Tadipatri) లో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత సూర్యముని ఇంటిపై వైసీపీ(YCP) నాయకుడు కేతిరెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కేతిరెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు.

Also Read : కొత్త రకం జొన్న పంటలో పుష్కలంగా ఇథనాల్‌..

ఇద్దరి నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండటంతో..
ఈ క్రమలో టీడీపీ కార్యకర్తల జేసీ నివాసానికి భారీగా చేరుకోగా.. వైసీపీ శ్రేణులు సైతం కేతిరెడ్డి(Kethireddy) ఇంటికి తరలివెళ్లారు. ఇద్దరి నేతల ఇళ్లు ఎదురెదురుగా ఉండటంతో కార్యకర్తలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. ఈక్రమంలోనే పెద్దారెడ్డిని ఇంటి నుంచి తీసుకెళ్లారు పోలీసులు. అయితే పెద్దారెడ్డి అరెస్ట్‌పై క్లారిటీ ఇవ్వకుండానే ఆయనను తరలించడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో జేసీ, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గరున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో చాలామంది వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్లగా.. జేసీ, పెద్దారెడ్డి ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోకి కొత్త వ్యక్తులు రాకుండా అన్నివైపులా చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇద్దరు డీఐజీలు, ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల బృందం రాళ్ల దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన జేసీ..
ఇదిలా ఉంటే.. నిన్న గొడవలతో తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) ఆస్పత్రిలో చేరారు. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా.. ఆ ప్రభావంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆసుపత్రి పాలైనట్లు ౠయన వర్గీయులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జేసీకి చికిత్స అందిస్తుండగా.. జేసీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉందని డాక్టర్లు వెల్లడించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని చూసేందుకు ఎవరూ రావొద్దన్న కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. దీనికోసం ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది.

New Update
chandrababu srikakulam

chandrababu srikakulam

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  సముద్రంలో వేట విరామ సమయంలో జాలర్లకు అందించే ఆర్థిక సాయం అందించనున్నారు.  ఏప్రిల్ 26వ తేదీ శనివారం రోజున సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీనికోసం కూటమి ప్రభుత్వం  రూ. 258 కోట్ల మేర ఖర్చు చేయనుంది. రేపు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.  

Advertisment
Advertisment
Advertisment