Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల

మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు.

New Update
Andhra Pradesh: పిన్నెల్లికి మరో షాక్‌.. పోలీసు కస్టడీకి పర్మిషన్

Pinnelli Ramakrishna Reddy Released Today : మాచర్ల (Macherla) వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు. రామకృష్ణారెడ్డి జైలు నుంచి నేరుగా బయట వేచివున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కారులో ఎక్కారు. ఆయన చెన్నై లేదా బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ (TDP) ఏజెంట్, సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

పిన్నెల్లికి కోర్టు పెట్టిన షరతులు..

– పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలి
– ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలి
– అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు

ఎన్నికల రోజున ఈవీఎం ధ్వంసం

2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పిన్నెల్లి మాచర్ల నుంచి బరిలోకి దిగారు. అయితే మే 13న పోలింగ్ రోజున.. రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ 202 పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది.

పిన్నెల్లిపై మొత్తం ఎన్ని కేసులంటే

అయితే పోలింగ్ రోజున మాచర్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అదే రోజున సాయంత్రం పోలీసులు పిన్నెల్లిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అల్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆయన మే 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కేసులు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్స్ పై దాడి, మహిళలను దూషించిన కేసు ఇలా మొత్తం ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి.

Also Read : 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. చెరువులో పడి నిందితుడు మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment