Andhrapradesh: ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం వైసీపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఇప్పటికే తన పార్టీ తరుఫున 175 మంది అభ్యర్ధులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు ప్రచారానికి రెడీ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్.

New Update
Andhrapradesh: ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం అంటూ ప్రచారంలోకి వైసీపీ

YCP Election Campaign: ఎన్నికల ప్రచారానికి సై అంటఉన్నారు ఏపీ సీం జగన్. ఎన్నికల కోసం మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రను చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలకు చేరువవ్వాలని అనుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారం మోఒదలెట్టనున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో 21 రోజు లపాటూ బస్సు యాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఇది కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా కొనసాగనుందని తెలుస్తోంది.

ప్రతీ జిల్లాలో ఒకరోజు ఈ బస్సు యాత్ర ఉండనుంది. ఉదయం ఇంటరాక్షన్ , మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని భావిస్తున్నారు వైసీపీ పార్టీ అధినేత జగన్. ప్రతీ రోజూ ప్రజలతో మాట్లాడుతూ...వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల వారీగా చేయనున్నారు.

న్నికల కార్యాచరణ రూపొందించుకోవడానికి పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్లతో ఇవాళ మధ్యాహ్నాం ఆయన భేటీ కానున్నారు. జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా సీఎం జగన్‌ ప్రచార పర్యటనలు ప్రధానాంశంగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పర్యటనలు కొనసాగాలి.. రూట్ మ్యాప్‌ ఎలా సాగాలి.. తదితర అంశాలపై ఈ కీలక సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. మూడు పార్టీల కూటమి బండారాల్ని ప్రజల ముందు ఉంచేలా కార్యచరణ రూపకల్పన, జిల్లాల వారీగా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Also Read:International : జపాన్‌లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు