/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/yash-jpg.webp)
Yash: కన్నడ స్టార్ నటుడు , కేజీఎఫ్ హీరో యశ్ (Yash) పుట్టిన రోజు నేడు. ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు(Birthday)ను ఎంతో ఘనంగా నిర్వహించాలని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం బ్యానర్ (Banner) ఏర్పాటు చేస్తుండగా..ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి (Current Shock)గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషాదం కర్టాటక (Karnataka) లోని గడగ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన యశ్ అభిమానులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతి చెందిన అభిమానులను హనుమంత మజ్జురప్ప హరిజన్ (20), మురళీ నీలప్ప నిడివిమని (20), నవీన నీలప్ప గజి (19) అనే యువకులు అక్కడికక్కడే కరెంట్ షాక్ తో మృతి చెందారు.
Also read: జగన్‌కు మరో బిగ్ షాక్.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?
20 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు ఒక్కసారిగా బ్యానర్ ని తాకాయి. బ్యానర్ ని పట్టుకుని ఉన్న ఆరుగురు యువకుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, యువకుల స్నేహితులు అభ్యర్థిస్తున్నారు.
కేజీఎఫ్ నటుడు జనవరి 8 న 38 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తన బర్త్ డే నేపథ్యంలో యశ్ జనవరి 5 నే తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. '' నా అభిమానులు నా పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. నన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఆశపడుతుంటారు. నాకు కూడా మీతో కలిసి సమయాన్ని గడపాలని ఉంది. అలా గడపడం నాకెంతో విలువైనది. అయితే జనవరి 8న నేను మీకు అందుబాటులో ఉండడం లేదు. మనం అందరం మరోసారి కలుద్దాం . మీ అందరిని నేరుగా కలవకపోయినా..మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి'' అంటూ రాసుకొచ్చారు.
యశ్ ముందు అనేక టీవీ సీరియల్స్ లో నటించారు. కన్నడలో 2007లో జంబడ హుడుగి అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా చేస్తున్నారు.
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.
anvesh sensational comments on bigg boss contestants
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.
Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
ఉగ్రదాడికి వీరే కారణం
అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే.
Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.
Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!
అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news