WTO Meet: ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది.. ఏకాభిప్రాయమే కుదరలేదు! ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO సమావేశం అబూదబీలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల అభ్యంతరాలతో ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా చేపల వేటపై రాయితీలను నిషేధించాలన్న భారత్ డిమాండ్ ను చైనా వ్యతిరేకించింది. By KVD Varma 02 Mar 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి WTO Meet: అబుదాబిలో ఐదు రోజుల పాటు జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది. సమావేశానికి ముందే పరిష్కారమవుతుందని భావించిన అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ప్రధాన సమస్యలు 5 రోజుల సమావేశం తర్వాత కూడా అలాగే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మొండి వైఖరి కారణంగా వాటిపై ఏకాభిప్రాయం కుదరలేదు. WTO తన వెబ్‌సైట్‌లో 5 రోజుల సమావేశాల తర్వాత ప్రకటన కోసం సిద్ధంగా ఉన్న ముసాయిదాను విడుదల చేసింది. సమావేశానికి ముందు, ఈసారి భారతదేశం ధాన్యం సేకరణ కార్యక్రమానికి WTO వేదికపై ప్రపంచ స్థాయిలో చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని భావించారు. అయితే డబ్ల్యూటీవో 13వ మంత్రివర్గ స్థాయి(WTO Meet) సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ధాన్యం సేకరణ కార్యక్రమానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చే అంశంపై బ్రెజిల్ అంగీకరించలేదని.. ఏకాభిప్రాయానికి అనుమతించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సబ్సిడీని నిషేధించాలి సుదూర జలాల్లో చేపలు పట్టే దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, చేపల వేటపై రాయితీలను నిషేధించాలని కూడా భారత్ సమావేశంలో కోరింది. భారతదేశం ఈ డిమాండ్‌ను చైనా వ్యతిరేకించింది. WTO సభ్య దేశాల మధ్య (WTO Meet)ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించడానికి చైనా మోకాలడ్డినట్టు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకు ప్రయోజనం ఇ-కామర్స్ ద్వారా దిగుమతులపై పన్ను విధించాలని భారతదేశం డిమాండ్ చేసింది. అభివృద్ధి చెందిన దేశాలలోని కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు మాత్రమే ఇ-కామర్స్ వాణిజ్యం నుండి ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొంది. WTO ఈసారి మంత్రివర్గ సమావేశంలో(WTO Meet), ఇ-కామర్స్ ద్వారా దిగుమతులకు ఇచ్చిన మినహాయింపు తదుపరి మంత్రివర్గ స్థాయి సమావేశం వరకు అంటే MC-14 వరకు ఉంటుంద, ఆ తర్వాత అది దానంతట అదే ముగియాలని నిర్ణయించారు. Also Read: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. భారతదేశ డిమాండ్‌పై.. WTO 13వ మంత్రుల స్థాయి సమావేశానికి సంబంధించి భారతదేశం మరొక పెద్ద డిమాండ్‌ను కలిగి ఉంది, దీనిలో WTOలో వివాద పరిష్కారాలను వేగవంతం చేయడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది భారత్. 12వ సమావేశంలో కూడా భారత్‌తో సహా పలు సభ్య దేశాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. ఈసారి వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసే కమిటీపై కసరత్తు చేస్తున్నట్లు సమావేశంలో తెలిపారు. సంతృప్తికరంగా లేని సమావేశ ఫలితం.. అబుదాబిలో జరిగిన WTO మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 26-29 తేదీలలో జరగాల్సి ఉంది. అయితే 4 రోజుల చర్చల తర్వాత, సమావేశ వ్యవధిని మరో రోజు పొడిగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తర్వాత ఈసారి కొన్ని ప్రధానాంశాలపై ఏకాభిప్రాయం కుదరుతుందన్న ఆశాభావం నెలకొంది. కానీ 5 రోజుల పాటు కొనసాగిన తరువాత కూడా ఫలితం అంత సంతృప్తికరంగా లేదు. #china #india #world-trade-organisation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి