Shubman Gill : 'ఇక చాల్లే... వెళ్లి ఐపీఎల్ ఆడుకో.. మరీ ఇంత ఘోరమా బ్రో' 😡! దక్షిణాఫ్రికా ఆడిన రెండు టీ20 ఇన్నింగ్స్‌లలో ఫెయిలైన గిల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 14 టీ20 మ్యాచ్‌ల్లో గిల్ రెండు సార్లే 50+ స్కోర్లు చేశాడు. వన్డేల్లో చెలరేగిపోతున్నా.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. By Trinath 15 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL : క్రికెట్(Cricket) లో అందరికీ అన్నీ ఫార్మెట్లు సెట్ కావు. టీ20, వన్డేల్లో దుమ్ములేపిన యువరాజ్ సింగ్, రైనా లాంటి ఆటగాళ్లు టెస్టుల్లో రాణించలేకపోయారు. రోహిత్‌శర్మ సైతం టెస్టుల్లో కొంతకాలంగా బాగా ఆడుతున్నాడు కానీ.. ఓ దశలో హిట్‌మ్యాన్ టెస్టులకు పనికిరాడన్న ముద్ర పడిపోయింది. ఇక ఐపీఎల్‌లో ధనాధన్ మెరుపులు మెరిపించే ధోనీ.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం తేలిపోయాడు. ఇలా ఒక చోట హిట్.. మరో చోట ఫట్ అయ్యే క్రికెటర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందరూ కోహ్లీలు కాదు కదా. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో వరుస ఫ్లాప్ షో తర్వాత గిల్(Shubman Gill) ఆటపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. Also Read: జెర్సీ నంబర్-7 రిటైర్స్ 🙇♀️.. బీసీసీఐ నిర్ణయంతో ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్ 😰..! వన్డేల్లో అద్భుతం.. టీ20ల్లో తుస్‌స్‌స్‌స్..! ఈ ఏడాది వన్డేల్లో గిల్ ప్రపంచంలోనే టాప్ రన్‌గెటర్‌గా నిలిచాడు. వన్డేల పరంగా గిల్ ఆడను అసలు వంక పెట్టలేం. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం గిల్ ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడు టీ20ల్లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20లో డకౌటైన గిల్.. మూడో టీ20లో 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో గిల్ బ్యాటింగ్ అప్రోచ్ ఏ మాత్రం బాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్‌లో వరుస సెంచరీలతో అభిమానులను అలరించిన గిల్.. అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. గత 14 టీ20 ఇంటర్నెషనల్ మ్యాచ్‌ల్లో గిల్ కేవలం రెండే 50+ స్కోర్స్ చేశాడు. అందులో కివీస్‌పై ఒక శతకం ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే గిల్ ఔటయ్యాడు. మరోవైపు యువ ఓపెనర్ యశ్వస్వి జైస్వాల్ సత్తా చాటుతున్నాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అయితే వచ్చే ఏడాది(2024) టీ20 వరల్డ్‌కప్ వరకు రోహిత్ జట్టుతోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ జట్టులోకి వస్తే టీ20ల్లో గిల్ బెంచ్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. Also Read: ఆ లిస్ట్‌లో గిల్ నంబర్-1.. సెకండ్ కోహ్లీ.. థర్డ్ ఎవరంటే? WATCH: #cricket #t20 #india-vs-south-africa #shubman-gill #world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి