Shami: 'అదంతా పిచ్చి వాగుడు..' ట్రోలర్స్‌కు ఇచ్చి పడేసిన మహ్మద్ షమీ! వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై 5 వికెట్లు తీసిన తర్వాత పేసర్ షమీ మోకాళ్లపై పడుకుని రెండు చేతులతో నేలను తాకాడు. షమీ నమాజ్ చేయకుండా ఆగిపోయాడన్న ప్రచారం జరిగింది. అయితే ఇదంతా నిజం కాదని.. ప్రార్థన చేయాలనుకుంటే ఎవరూ తనను అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టాడు షమీ. By Trinath 13 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వరల్డ్‌కప్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాండ్యా గాయపడిన తర్వాత తుది జట్టులోకి వచ్చిన షమీ.. తనను పక్కన పెట్టడం ఎంత పాపమో కళ్లకు కట్టినట్టు చూపించాడు. అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఫైఫర్లు(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) తియ్యడం ఇంత ఈజీనా అన్నట్లు సాగింది షమీ ప్రదర్శన. సెమీస్‌లో ఏకంగా 7వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బౌలింగ్ పిచ్‌లపై షమీ రాణించిన తీరు అందరిని కట్టిపడేసింది. అయితే కొంతమంది ట్రోలర్స్‌కు పనీపాటా అసలు ఉండదు కదా.. ఏదో ఒకటి కాంట్రవర్శి చేయకపోతే ముద్దదిగదు కదా.. అందుకే షమీపైనే లేనిపోనివి క్రియేట్ చేశారు. అసలేం జరిగిదంటే? శ్రీలంకపై మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబరిచిన మహ్మద్ షమీ ఫైఫర్ అనంతరం గ్రౌండ్‌పై వాలిపోయాడు. ఆ సమయంలో షమీని చూస్తే ఎంత భావోద్వేగంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. తుది జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వడమే కష్టం అని అంతా భావించిన సమయంలో షమీ రీ-ఎంట్రీలో కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు షమీ టీమిండియా సూపర్ హీరో. శ్రీలంకపై మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు తీసిన తర్వాత మోకాళ్లపై పడుకుని రెండు చేతులతో నేలను తాకాడు. ఇలా గ్రౌండ్‌పై వాలడం ప్రేయర్‌ను తలపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే షమీ ఎందుకు ప్రేయర్ చేయకుండా ఆగిపోయాడని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. పాకిస్థాన్ ప్లేయర్ రిజ్వాన్ గ్రౌండ్‌లోనే నమాజ్ చేసే విషయం తెలిసిందే. ఈ ఘటనపై కొన్ని వర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. షమీ కూడా అందుకే ప్రేయర్ చేయకుండా ఆగిపోయాడని చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్‌పై షమీ తాజాగా స్పందించారు. అదంతా పిచ్చి వాగుడు: అజెండా ఆజ్ తక్(aaj tak)లో మాట్లాడిన షమీ.. తాను గర్వించదగిన భారతీయుడిని, గర్వించదగిన ముస్లింనని చెప్పారు. ప్రార్థన చేయాలనుకుంటే ఎవరూ తనను అడ్డుకోలేరని కుండబద్దలు కొట్టాడు. గతంలో 5 వికెట్లు తీసిన తర్వాత తాను ఎప్పుడూ ప్రేయర్ చేయలేదని గుర్తు చేశాడు షమీ. అసలు ఈ కథనాలు ఎలా అల్లారో తనకు అర్థంకావడంలేదన్నాడు. తాను నమాజ్ చేయాలను తనన్ను ఎవరు ఆపలేరని.. తాను ఎవరినీ నమాజ్ చేయకుండా ఆపనని స్పష్టం చేశాడు. 'నమాజ్ చేయాలనుకుంటే చేస్తాను.. ఇందులో ఏముంది సమస్య.. నేను ముస్లింనని గర్వంగా చెబుతాను. నేను భారతీయుడిని అని గర్వంగా చెబుతా.. అందులో ఏముంది ప్రాబ్లమ్?.. ప్రార్థన చేయడానికి ఎవరితోనైనా పర్మిషన్ అడగాలంటే, నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను?, ఇంతకు ముందు 5 వికెట్లు తీసిన తర్వాత నేను ఎప్పుడైనా ప్రార్థన చేశానా? నేను చాలా ఐదు వికెట్లు తీశాను. మీరు ఎక్కడ ప్రార్థనలు చేయాలో చెప్పండి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేస్తాను' అని కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు షమీ. Also Read: అందినట్టే అంది చేజారిన మ్యాచ్.. రెండో టి20లో సౌతాఫ్రికాదే విజయం WATCH: #cricket #mohammed-shami #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి