T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్‌ టూ యూఏఈ!

మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను ఐసీసీ మార్చింది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది.

New Update
T20 womens world cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్‌ టూ యూఏఈ!

T20 womens world cup: ఎట్టకేలకు మహిళల టీ20 ప్రపంచకప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీని యూఏఈలో నిర్వహించబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

ఈ మేరకు ‘బంగ్లాదేశ్‌లో మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్వహించలేకపోతున్నాం. ఇది ఎంతో నిరాశ కలిగిస్తోంది. బంగ్లా బోర్డు గొప్పగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. కానీ అక్కడ పర్యటించడానికి చాలా దేశాల బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఒక ఐసీసీ టోర్నీని అక్కడ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తాం. మెగా టోర్నీకి అతిథ్యం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎమిరేట్స్‌ బోర్డుకు అభినందనలు' అంటూ ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెఫ్‌ అలార్డిస్‌ తెలిపాడు. ఇక యూఏఈ వేదికగా అక్టోబరు 3 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్

ట్రంప్ సుంకాల దెబ్బ గట్టిగానే పడుతోంది. కార్ల మీద కూడా దీని ఎఫెక్స్ చూపిస్తోంది. పెద్ద కంపెనీలు తమ కార్ల ఎగుమతులపై ఆలోచిస్తున్నారు. తాజాగా జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్ బ్రిటిష్‌లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది.

New Update
usa

JLR cars

జాగ్వారా, ల్యాండ్ రోవర్ బిట్రన్ లో తయారయ్యే కార్లు. టాటా మోటార్స్ కు చెందిన లగ్జరీ కార్లు ఇవి. బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్‌ సంస్థ..  బ్రిటన్‌లో సుమారు 38 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ తమ కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నెల పాటూ ఆపాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25శాతం టారీఫ్ లను విధించారు. దీంతో టాటా జాగ్వార్ తమ కార్ల ఎగుమతులను నెలపాటూ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ది టైమ్స్ చెబుతోంది. సుంకాలను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించడానికే ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆలోచనలో పడ్డ అన్ని కంపెనీల కార్లు..

జెఎల్ ఆర్ ఒక్కటే కాదు..ఇతర దేశాల్లో తయారయ్యే అన్ని కార్ల కంపెనీలు ఇదే ఆలోచనలో పడ్డాయని చెబుతున్నారు. అయితే జే ఎల్ ఆర్ ఇప్పటికే మరో రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఎగుమతి చేసేసింది. అందుకే ఇప్పుడు నెల గ్యాప్ తీసుకున్నా పర్వాలేదని భావిస్తోంది. ఈ నెలలో సుంకాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటోంది. 2024 మార్చి వరకు 12 నెలల వ్యవధిలో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ 4.30 లక్షల వాహనాలను విక్రయించగా.. అందులో నాలుగో వంతు అమెరికాలో అమ్ముడయ్యాయి. మరోవైపు ట్రంప్ ప్రకటించిన టారీఫ్ లవలన టాటా మోటార్స్ షేర్లు బాగా పడిపోయాయి.   

 today-latest-news-in-telugu | cars | tata-motors

Also Read: USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు

Advertisment
Advertisment
Advertisment