Health Tips: మహిళలూ ఈ లడ్డు తిన్నారో.. ఆ సమస్యలు ఫసక్..!!

ఆడవారికి నెలసరి సమయంలో సమస్యలు ఉంటే అటుకుల వాల్ లడ్డు తినండి. రక్తహీనత, నీరసం, నడుము నొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ లడ్డు కడుపు నొప్పి, నీరసం తగ్గించి..గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

New Update
Health Tips: మహిళలూ ఈ లడ్డు తిన్నారో.. ఆ సమస్యలు ఫసక్..!!

Anukula Valladdu: ఆడవారికి నెలసరి సమయంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో వారు ఏ పని చేసినా అలిసిపోతారు. నెలసరి సమయంలో రక్తహీనత, నీరసం, నడుము నొప్పి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కొందరిని బాగా వేధిస్తుంటాయి. ఇలాంటి సమస్యలను దూరం చేయాలంటే మనం తినే డైట్‌లో కొన్ని ఆహారాలను ఖచ్చితంగా చెర్చుకోవాలని వైద్యులు అంటారు. ఇలాంటి ఆహారంలో అటుకుల వాల్ లడ్డు కూడా ఒకటి. ఈ లడ్డు తింటే కొన్ని సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో, దాని వల్ల  ఎలాంటి ఉపయోగాలున్నాయో..  ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అటుకుల వాల్ లడ్డు తయారీ విధానం:

  • ముందుగా స్టావ్ ఆన్‌ చేసి..  ఓ గిన్నెలో అటుకులు దోరగా వేయించి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో వాల్ నట్స్, బెల్లం తురుము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని వాటికి అటుకులు పొడి కలిపి చిన్న చిన్న ల‌డ్డూలుగా తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే అటుకుల వాల్ నట్ ల‌డ్డు రెడీ అవుతుంది. ఇది తినడానికి ఎంతో రుచితోపాటు అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

నొప్పి, నీరసం నుంచి ఉపశమనం:

  • ఈ అటుకుల లడ్డులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఈ లడ్డును అమ్మాయిలు రోజుకొకటి చొప్పున తింటే రక్తహీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా హార్మోన్లు సమతుల్యం అవుతాయని వైద్యులు అంటారు. స్త్రీలకు నెలసరిలో వచ్చే కడుపు నొప్పి, నీరసంవంటి సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఉడకబెట్టిన తర్వాత గుడ్లు ఎంతసేపటిలో తినాలి..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు