Telangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ

తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్‌​ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది.

New Update
Telangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ

Mahaboobabad: మహబూబాబాద్‌​ జిల్లా కురవి మండలం బంచరాయితండాకు చెందిన బోడ వీరన్న, కుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరు మూడేళ్ళ నుంచి అక్కడే గౌతమ బుద్ధ కాలనీలో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్ళగా కూతుర్లు ముగ్గురూ, వీరన్న పోదరుని కుమార్తె కూడా బట్టలు ఉతుక్కోవడానికి దగ్గరలో ఉన్న క్వారీలోకి వెళ్ళారు. అక్కడ ఉన్న నీటి గుంతలో బట్టలు ఉత్తోకోవాలని అనుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయారు.

చిన్నారులు నీటిలో మునిగిపోతూ ఆర్తనాదాలు చేశారు. ఇది చుట్టుపక్కల వారు అందరూ విన్నారు వారితో పాటూ దగ్గరలోనే ఉంటున్న నెరుసు ఉప్పలమ్మ అనే ఆమె కూడా వింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. మునిగిపోతున్న బాలికలను చూసింది. అంతే వెంటనే గుంతలోకి దిగిపోయింది. ఎంతో ధైర్యంగా పిల్లలను కాపాడింది. అడుగుకు వెళ్ళిపోతున్న వారిని ఒడ్డుకు చేర్చింది. అయితే ఉప్పలమ్మ ఎంత ప్రయత్నించినా ఒక అమ్మాయిని మాత్రం కాపాడలేకపోయింది. ఆమె వచ్చేసరికి చిన్నారి గుంత అడుగులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.

ఆ తరువాత చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని క్వారీ గుంతలో దిగి ఆ నీటి మధ్య భాగంలోని అడుగుకు వెళ్లి వెతకగా చిన్నారి దొరికింది. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు వారు గుర్తించారు. అయితే మిగిలిన పిల్లలు ప్రాణాలతో బయటపడడం కొంత ఉపశమనం కలిగించింది. ముగ్గురిని కాపాడిన ఉప్పలమ్మను స్థానికులు, పోలీసులు అభినందించారు.

Also Read:I phone 15 Sale: ఫ్లిప్ కార్ట్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 15..

Advertisment
Advertisment
తాజా కథనాలు