ఈ స్కీమ్ తో ఉద్యోగులకే కాదు...సామాన్యులకూ ఎన్నో బెనిఫిట్స్...పూర్తి వివరాలివే..!!

పది రకాల రిటైర్ మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ను అందిస్తోంది భారత ప్రభుత్వం. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కిములో ఏ ఇండియన్ సిటిజన్ అయినా కూడా చేరి రిటైర్ మెంట్ కోసం డబ్బులు ఆదా చేసుకునే సదుపాయం ఉంది.

New Update
Financial Decisions: ఎడాపెడా డబ్బు ఖర్చు చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకుంటే పొదుపు చేయడం పక్కా..!!

రిటైర్మెంట్ తర్వాత ఖర్చుల కోసం డబ్బులు దాచుకోవాలి. చివరి రోజుల్లో ఎవరిపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వర్కింగ్ డేస్ లోనే సేవింగ్స్ మొదలుపెట్టాలి. భారత ప్రభుత్వం పది రకాల రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ వాలంటరీ స్కీమ్ లో ఏ ఇండియన్ సిటిజన్ అయినా సరే చేరి రిటైర్మెంట్ కోసం డబ్బును ఆదా చేసుకోవచ్చు. 2004లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్ పీఎస్ ను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. 2009లో దీనిని పౌరులందరికీ విస్తరించింది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.

ఈ పథకంలో చేరాలంటే 18ఏళ్ల నుంచి 70ఏళ్ల వయస్సు గల భారత పౌరులు లేదా నివాసి లేదా నాన్ రెసిడెంట్ ఎవరైనా సరే ఎన్పీఎస్ లో చేరవచ్చు. ఇందులో చేరే వాళ్లు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే. ఎన్పీఎస్ కు సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇండివిడ్యువల్స్ మనీ కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్నవారు యజమాని కూడా కాంట్రిబ్యూషన్ ను అందించవచ్చు. వీటిపై టాక్స్ డిడక్షన్స్ కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీసీఈ కింద మొత్తం రూ. 1.50లక్షల గరిష్ట పరిమితితో సెక్షన్ 8 సీసీడీ ప్రకారం జీతంలో పది శాతం ట్యాక్స్ డిడక్షన్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 80 సీసీడీ కింద యజమాని అందించిన జీతంలో గరిష్టంగా పది శాతం కోసం ట్యాక్స్ డిడక్షన్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. సొంతంగా ఉపాది పొందే వ్యక్తులు సెక్షన్ 8 సీసీడీ కింద స్థూల ఆదాయం, పది శాతం వరకు ట్యాక్స్ డిడక్షన్ను క్లెయిమ్ చేసుకోవచ్చు. సబ్ స్క్రైబర్లు ఎన్పీఎస్ అకౌంట్ కు ఎక్స్ ట్రా కాంట్రిబ్యూషన్స్ అందించవచ్చు. వీటిపై సెక్షన్ 80సీసీడీ కింద రూ. 50వేల వరకు సపరేట్ ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేసే సదుపాయం ఉంది.

పదవీ విరమణ వయస్సు వచ్చా, సబ్ స్క్రైబర్స్ పెన్షన్ అమౌంట్ లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా విత్ డ్రా చేసుకోవచ్చు. PFRDA-అప్రూవ్డ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి లైఫ్ యాన్యూటీ కొనుగోలు చేసేందుకు మిగిలిన నిధులను కూడా ఉపయోగించవచ్చు. అలా పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా కొంత మొత్తంలో ఇన్ కమ్ అందుకోవచ్చు. ఎన్పీఎస్ అకౌంట్ ను పోర్టబుల్ చేసుకోవచ్చు. సబ్ స్క్రైబర్ ఉద్యోగాన్ని మార్చుకుంటే ఎన్పీఎస్ అకౌంట్ ను కొత్త రంగాన్నికి బదిలీచేయవచ్చు. అది ప్రభుత్వమైనా సరే కార్పొరేట్ అయినా సరే.

ఇది కూడా చదవండి: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు