Cat : ఐదు రోజులుగా తిండి లేక.. పిల్లిని పీక్కుతిన్న యువకుడు

కేరళలో వింత ఘటన వెలుగుచూసింది. ఐదు రోజులుగా తిండి లేక ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడు.. చనిపోయిన పిల్లిని పిక్కుతింటూ కనిపించాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడికి ఆహారం అందించి.. అతడి గురించి వివరాలు ఆరా తీశారు.

New Update
International : జపాన్‌లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్

No Food : కేరళ(Kerala) లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కొన్నిరోజుల నుంచి తిండి లేక(No Food) ఆకలి(Hungry) తో అలమటిస్తున్న ఓ యువకుడు.. ఏకంగా ఓ చనిపోయిన పిల్లిని పీక్కుతింటూ(Eating Raw Flesh Of Cat) కనిపించాడు. అతడ్ని చూసి అక్కడి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. మలప్పురం జిల్లా(Malappuram District) కుట్టిపురం బస్టాండ్‌లో ఈ దిగ్ర్భాంతికర ఘటన వెలుగుచూసింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీనా అక్కడికి చేరుకున్నారు. అతనికి ఆహారం అందించి.. ఆ తర్వాత వివరాలు సేకరించారు.

Also Read : సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'అస్సాం(Assam) లోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ యువకుడు (27) అక్కడే ఓ కాలేజీలో చదువుతుండేవాడు. అయితే గత ఏడాది డిసెంబర్‌లో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా రైలు ఎక్కి కేరళకు వచ్చేశాడు. డబ్బులు లేకపోవడంతో అయిదు రోజుల నుంచి అతడికి తిండి లేదు. ఆకలి బాధను తట్టుకోలేకపోయాడు. అతడికి ఓ చనిపోయిన పిల్లి కనిపించింది.

దీంతో దాని మాంసాన్నే పచ్చిగా తింటూ మనుషులకు కనిపించాడని' పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి సమాచారం అందిచినట్లు తెలిపారు. అలాగే యువకుడ్ని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment