JrNTR : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?

బాలకృష్ణ 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ అంతా తరలివస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తారక్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

New Update
JrNTR : బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ ఈవెంట్ కు ఎన్టీఆర్ వస్తాడా?

Nandamuri Balakrishna : సెప్టెంబర్ 1న జరగనున్న బాలకృష్ణ గారి 50 ఏళ్ల సినీ జర్నీ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి టాలీవుడ్‌లోని అగ్రనాయకులు, దర్శకలు, నిర్మాతలు హాజరవుతారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్‌తో కలిసి హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇదే వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ 'బాబాయ్' ని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.గా

Also Read : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదు

ఎందుకుంటే గత కొంతకాలంగా నందమూరి హీరోల మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య మధ్య అస్సలు పడటం లేదని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో బాలయ్య 50 ఏళ్ళ సినీ జర్నీ వేడుకకు తారక్ వస్తాడా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఈవెంట్ కు ఈ టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు మంచు కూడా హాజరు కానున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్లు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న "ది రాజా సాబ్" నుంచి మే మద్యలో భారీ అప్‌డేట్ రాబోతోందని దర్శకుడు హింట్ ఇచ్చారు. నిర్మాణం ఆలస్యమవడంతో 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ వాయిదా పడింది.

New Update
Maruthi Raja Saab Tweet

Maruthi Raja Saab Tweet

Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ  రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌ "ది రాజా సాబ్"మూవీ నుండి అప్‌డేట్ రాబోతుందని డైరెక్టర్ మారుతి(Director Maruthi) సోషల్ మీడియా 'X' ద్వారా హింట్ ఇచ్చారు.  

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

HIGH ALERT…!!

చాలా రోజులుగా అభిమానులు ఈ సినిమాపై కొత్త అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి కోరిక నెరవేరినట్టు కనిపిస్తోంది. దర్శకుడు మారుతి తన 'X' (ట్విట్టర్) ఖాతాలో ఓ ఆటోపై ప్రభాస్ స్టిల్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “HIGH ALERT…!! HEAT WAVES gonna rise even higher from mid-May!” అంటూ క్యాప్షన్ పెట్టారు.

Maruthi Raja Saab Tweet
Maruthi Raja Saab Tweet

 

Also Read: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ పోస్ట్‌తో మే మద్యలో భారీ అప్‌డేట్ రానుందని స్పష్టమవుతోంది. ఇది టీజర్‌కు సంబంధించినదా? లేక విడుదల తేదీకి సంబంధించినదా? అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అసలు "ది రాజా సాబ్"ను మొదట 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, నిర్మాణంలో జాప్యం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరో కథానాయికగా కనిపించనున్నారు.

ఈ భారీ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందిస్తున్నారు.

 

 

Advertisment
Advertisment
Advertisment