Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..

ప్రేమ గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు...ప్రేమను వ్యక్త పరచడానికి ఒక్క రోజు చాలదు. కానీ వేలంటైన్స్‌డే రోజు మాత్రం దీనికి అతీతం. ఈ రోజు ప్రేమకు ఓ ప్రత్యేకత ,ఒక ఆకర్షణా ఉంటుంది. అందుకే ఈ రోజుకు అంత స్పెషాలిటీ. అసలు ఇది ఎక్కడ, ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా..

New Update
Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే..

Who Is This Valentine:మదర్స్ డే, ఫాదర్స్ డే, వుమెన్స్ డే… ఇలా స్పెషల్ రోజుల గురించి మాట్లాడేటప్పుడు అన్నిటికంటే ముందు గుర్తొచ్చే డే, వేలంటైన్స్ డే. అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్టు ప్రేమికుల కోసమే ఈ వేలంటైన్స్ డే. అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరమే లేదు. ప్రేమను ఎప్పుడైనా ఎలాగైనా వ్యక్తం చేయొచ్చు. అయితే వాలెంటైన్స్ డే జరుపుకోవడం వెనుక ఓ చరిత్ర ఉంది. అసలు వాలెంటైన్స్ డే అంటే ఏంటీ? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకొంటారు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఇప్పటి చరిత్ర కాదు..

వేలంటైన్స్ డే ఎందుకు జరుపుకొంటారు అన్న ప్రశ్నకు రకరకాల సమాధానాలున్నాయి. వేర్వేరు చరిత్రలున్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం వేలంటైన్ గురించి. ఈ వేలంటైన్స్ డే ఇప్పటిది కాదు. క్రీస్తు శకం 270 నాటిది. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మతగురువు వేలంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్‌లో ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. యువతీయువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవాడు. అంతేకాదు… ప్రేమలో మునిగితేలుతున్న యువతీయువకులకు దగ్గరుండి మరీ పెళ్లి కూడా చేసేవాడు. ఆ సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాడియస్. క్రూరాతిక్రూరమైన రాజు. ప్రేమ పెళ్లిళ్లు కాదు కదా అసలు పెళ్లిళ్లంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదు. అందుకే పెళ్లిళ్లపై నిషేధం విధించాడు.

చనిపోయేంత వరకు ప్రియురాలి ప్రేమలోనే వేలంటైన్...

ఓవైపు పెళ్లిళ్లు అంటే ఇష్టం లేని రాజు క్లాడియస్… మరోవైపు ప్రేమ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్న వేలంటైన్. క్రమంగా అక్కడ ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. ఏం జరుగుతుందా అని క్లాడియస్ ఆరా తీశాడు. వేలంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలిసింది. అంతే… ఈ ప్రేమలకు, పెళ్లిళ్లకు వేలంటైన్ కారణమని తెలుసుకున్న క్లాడియస్ అతడిని బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో మరణశిక్ష విధించాడు. అయితే ఎంతోమంది ప్రేమ పెళ్లిళ్లకు కారణమైన వేలంటైన్… జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. చివరికి వేలంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. చనిపోయేవరకు ప్రియురాలి గురించే తలచుకుంటూ ఉన్నాడు వాలెంటైన్. యువర్ వేలంటైన్... అంటూ అని ఆమెకు చివరి ప్రేమలేఖ కూడా రాసి చనిపోయాడు. అలా... యువర్ వేలంటైన్, అనే మాట ప్రేమికుడికి పర్యాయ పదంగా మారిపోయింది. వేలంటైన్ చనిపోయిన రోజునే ప్రేమికుల దినోత్సవం..

ఫిబ్రవరి 14న వేలంటైన్‌ను ఉరి తీశారు కాబట్టి అదే రోజున ప్రేమికుల రోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే భారతదేశంలో మాత్రం ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం 1990వ దశకంలో మొదలైంది. ఆర్థిక సరళీకరణ తర్వాత వేలంటైన్స్‌ డే ఇండియాలో పాపులర్ అయింది. దీనిపై ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. ప్రేమికుల రోజు భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకించేవాళ్లున్నారు. వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు… పలు హిందుత్వ సంస్థలు ధర్నాలు, ఆందోళనలు, గొడవలు చేయడం చూస్తూనే ఉంటాం. ఇక ప్రేమికుల రోజు కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన మాయ అన్న వాదన మరొకటి ఉంది. ఎందుకంటే వేలంటైన్స్‌ డే సందర్భంగా వందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచమంతా ప్రేమికుల మనసుల్లో వేలంటైన్స్‌డే ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment