ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి బాబ్రీ మసీదు పేరు తొలగింపు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కీలక మార్పులు చేసింది. పన్నెండవ తరగతి పుస్తకం నుంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. అలాగే అయోధ్య అధ్యాయం నుంచి నాలుగు పేజీలను కూడా తగ్గించేసింది. By Manogna alamuru 16 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya- Babri Masjid: బాబ్రీ మసీదు అనే పేరును తొలగిస్తూ ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 12th పాఠ్యపుస్తకాల్లో అయోధ్య అనే అధ్యాయం ఉంది దీనిలో నుంచి నాలుగు పేజీల నుంచి రెండు ఏజీలకు తగ్గించారు. దాంతో పాటూ బాబ్రీ మసీదు అనే పదాన్ని తొలగించి మూడు గోపురాల నిర్మాణం అనే పదాన్ని జోడించారు. రాముడి రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాలను చాలా మట్టుకు తగ్గించేశారు. అయోధ్యలో మసీదుకు 16వ శతాబ్దంలో బాబ్రీ మసీదని పేరు పెట్టారు. మీర్ బాకీ దీనిని నిర్మించారు. కానీ హిందువుల ప్రకారం 1528లోనే ఇక్కడ జన్మించాడని..అందుకు సంబంధించిన చిత్రలేఖనాలు, శిల్పాలతో నిర్మించిన నిర్మాణంగా వర్ణించబడింది. మతపరమైన ఉద్రిక్తత, అల్లర్లకు దారితీసిన మసీదును ప్రార్థన కోసం తెరవాలని 1986 ఫైజాబాద్ జిల్లా కోర్టు నిర్ణయం లాంటి విషయాలు పాత పుస్తకం వివరంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త పుస్తకంలో ఈ సంఘటనలను క్లుప్తం చేసేశారు. మూడు గోపురాల నిర్మాణం ప్రారంభోత్సవం, ఆ తర్వాత జరిగిన చట్టపరమైన, మతపరమైన వైరుధ్యాలను మాత్రమే వివరించేట్టుగా కొత్త పుస్తకాల్లో పెట్టారు. కొత్త వెర్షన్‌లో వివాదాస్పద భూమి ఆలయానికి చెందుతుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ వివరణ అందులో పొందుపరిచారు. దాంతో పాటూ ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావన కూడా తొలగించారు. అలాగే బీజేపీ రథయాత్ర ప్రస్తావన అప్పుడు జరిగిన గొడవలను కూడా పూర్తిగా తీసేశారు. Also Read:Pawan Kalyan: సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా…డిప్యూటీ సీఎం నా మజాకానా… #ayodhya #cbse #ncert #text-books మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి