Children Tips : మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది? మానసిక ఒత్తిడి కారణంగా, జింక్, రక్త హీనత, కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 07 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Mud : చిన్నప్పుడు మట్టి తినడం(Eating Mud), బలపం తినడం, రాతి పలకను పగలగొట్టి దాని ముక్కలు, పెన్సిల్(Pencil) చివర తినడం, గులకరాళ్లు తినడం చాలా మందిలో కనిపిస్తుంటాయి. ఇప్పటికీ చాలా మంది పిల్లల్లో ఈ అలవాటు కనిపిస్తోంది. కొందరికి పెద్దయ్యాక కూడా ఈ అలవాటు అలాగే ఉండిపోతుంది. ఇలాంటివన్నీ తినే అలవాటు ఎవరికైనా ఉంటే దాన్ని పికా అంటారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. కొన్ని చిట్కాలతో మట్టి తినే అలవాటును మాన్పించవచ్చు. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలలో ఎక్కువ: చిన్నపిల్లలు(Children's), గర్భిణీ స్త్రీలు(Pregnant Ladies) మట్టి లేదా గోధుమ గులకరాళ్లు తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. ఇది మొదటి సంవత్సరం వయస్సు నుంచి పళ్ళు వచ్చే వరకు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వయస్సు పిల్లలలో ఆ లక్షణాలు సాధారణమే అని నిపుణులు అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మట్టిని తినడానికి కారణం: శరీరంలో ఇనుము లేకపోవడం, శరీరంలో జింక్, కాల్షియం లేకపోవడం కూడా కారణమని నిపుణులు అంటున్నారు. రక్త హీనత ఉన్నా ఇలాంటి అలవాట్లు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఈ అలవాటు వస్తుందంటున్నారు. మట్టి తింటే ఏమవుతుంది? కడుపులో పురుగులతో పాటు అతిసారం ఏర్పడుతుంది. అంతేకాకుండా పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. ఇది స్కిజోఫ్రెనియా సూచనలు అని, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్‌గా వైద్యులు చెబుతున్నారు. అరటి పండు: పిల్లలకు అరటిపండ్లు(Banana) తినిపించడం వలన మట్టి తినే అలవాటును క్రమంగా తగ్గుతుంది. అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించి మంచి ఫలితం ఉంటుంది. పిల్లల శరీరంలో కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా దృష్టి పెట్టాలి. కాల్షియం ఎక్కవగా ఉన్న ఫుడ్స్, కాల్షియం మందులు ఇస్తే మంచిది. లవంగం నీరు పిల్లలకు మట్టి తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు మంచిగా పనిచేస్తాయి. కొన్ని లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలకు తాపించాలి.ఈ నీరు వలన కొన్ని రోజుల్లో పిల్లలు మట్టి తినడం తగ్గుతుంది. ఇది కూడా చదవండి: ఇవి తింటే మీ లివర్ మొత్తం శుభ్రం..మళ్లీ కొత్తగా మారుతుంది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #childrens #health-benefits #pregnant-ladies #mud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి