Health News: చనిపోయిన వారి మాటలు కొందరికి ఎందుకు వినిపిస్తాయి?

ఓ వ్యక్తి ఇంద్రియ ముద్రలు మెదడు అంచనాలతో సరిపోనప్పుడు చనిపోయినవారి మాటలు ఇంకా వినిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి రుగ్మతలు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంచుకుని, దృష్టిని పనిపై నిమగ్నం చేస్తే ఎలాంటి భయాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు

New Update
Health News: చనిపోయిన వారి మాటలు కొందరికి ఎందుకు వినిపిస్తాయి?

Health News: ప్రపంచంలో చాలా మందికి చనిపోయినవారి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. అయితే.. ఈ హలోజినేషన్‌ను స్కిజోఫ్రెనియా అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కేవలం స్కిజోఫ్రెనియా ఉన్నవారే కాకుండా ఇతర మానసిక రుగ్మతలు ఉన్నవారు కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఓ వ్యక్తి ఇంద్రియ ముద్రలు మెదడు అంచనాలతో సరిపోనప్పుడు ఇలా జరుగుతున్నట్లు వైద్యులు తేల్చారు.

కళ్లకు గంతలు కట్టి ప్రయోగం 

అయితే ..ఇప్పుడు ఈ ఆడిటరీ హలోజినేషన్స్‌ ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు రోబోటిక్‌ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగంలో కొందరు వ్యక్తుల కళ్లకు గంతలు కట్టి వారి ముందు ఉన్న బటన్‌ను నొక్కమని చెప్పారు. అలా బటన్‌ నొక్కగానే రోబోటిక్‌ చేయి వారి వీపుపై తాకింది. అప్పుడు మెదడు మాత్రం వెనుకవైపు టచ్‌ చేసింది సొంత చెయ్యే అని గుర్తించింది. ఆ తర్వాత ప్రయోగంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు వాళ్లు బటన్‌ నొక్కగానే రోబోటిక్‌ చెయ్యి వచ్చి తగిలేలా సెట్‌ చేశారు. దీంతో వారి మెదడు అక్కడ ఎవరో ఉన్నారని, వాళ్లే వెనుక తాకినట్టు కన్ఫార్మ్‌ చేసుకుంది.

ఇది కూడా చదవండి: ఈ ఐదు ఆహార పదార్థాలు పక్కన పెడితే.. మధుమేహం, స్థూలకాయం పరార్..!!

అలాగే ప్రయోగంలో పాల్గొన్నవారికి మొదట సొంత వాయిస్‌ వినిపించారు. ఆ తర్వాత వేరే వాళ్లవి, మళ్లీ అసలు వాయిస్‌లు వినపడకుండా చేశారు. ఆశ్చర్యంగా కొందరికి అక్కడ ఏ స్వరం లేకపోయినా శబ్దాన్ని వినే అవకాశం ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలా హలోజినేషన్ మెకానిజమ్స్ ప్రతి ఒక్కరి మెదడులో ఉన్నట్టు నిర్థారించారు. అయితే.. కొన్ని కారణాల దృష్ట్యా కొందరికి మాత్రం ఇతరుల కంటే ఎక్కువ ఈ అనుభవాలు ఎదురవుతాయని గుర్తించారు. ఇలాంటి రుగ్మతలు ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని, మనసు ప్రశాంతంగా ఉంచుకుని, దృష్టిని పనిపై నిమగ్నం చేస్తే ఎలాంటి భయాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానసిక వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు