BCCI: వారి కథ కంచికేనా.. భారత క్రికెట్ టీమ్‌కు ఇక వారి సేవలు అందుబాటులో ఉండవా.. సీనియర్ పేసర్, స్పీన్నర్, ఓపెనర్‌లను బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది. వారు ఇక క్రికెట్ ఆడరా..? యువత వెలుగులోకి వచ్చాక బీసీసీఐ వారిని పట్టించుకోవడంలేదా..? లేక వారి ఫామ్ వారిని మెగా టోర్నికి దూరం చేసిందా అనే సందాహాలు వ్యక్తం అవుతున్నాయి. By Karthik 05 Sep 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ మెగా టోర్నీకి సీనియర్లను ఎందుకు దూరం పెట్టింది.? ఆ నలుగురు స్టార్ క్రికెటర్ల కెరీర్ ఇక ముగిసినట్లేనా.? అందుకు బీసీసీఐకి ఐపీఎల్ మంచి వేదికైందా.? ఫామ్‌లో ఉన్న స్పీనర్ వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనే టీమ్‌లో ఎందుకు లేడు.? దీని వెనుక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ రహస్య మంతనాలు ఏమైనా ఉన్నాయా..? అజిత్ అగార్కర్ మనస్సులో ఉన్న ఆలోచన ఎంటి మరోనెలలో స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఈ టోర్నీలో పాల్గోనే టీమ్‌ను ప్రకటించింది. ప్రపంచ కప్ టోర్నీలో పాల్గోనే టీమ్‌ను పరిశీలిస్తే.. శుభ్‌మన్ గిల్, రోహిత్(కెప్టెన్), విరాట్, అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీరాజ్, మొహమ్మద్ షమీరాజ్ , కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఓపెనర్ శిఖర్ ధావన్‌లను సెలక్టర్‌లు ఎంపిక చేయకపోవడం చర్చనీయంశంగా మారింది. అశ్విన్ ఎంతటి మేటి క్రికెటర్లనైనా తన బౌలింగ్‌తో వారిని అడ్డుకుంటాడు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను ఫెవిలియన్ పంపిస్తుంటాడు. అలాంటి స్పిన్నర్‌ను ప్రస్తుత వర్డల్ కప్‌కు దూరం పెట్టడంతో బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌తో కాకుండా బ్యాటింగ్‌లో సైతం రాణిస్తున్నాడు. కాగా ఇటీవల జరిగిన వరల్డ్‌టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంతో భారత్ ఆ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. మరోవైపు అశ్విన్‌తో పాటు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఓపెనర్ శిఖర్ ధావన్‌లను పక్కన పెట్టడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూవి తన స్వింగ్ బంతులతో ఓపెనర్లను ఫెవిలీయన్ పంపగల సమర్దుడు. మరోవైపు శిఖర్ ధావన్ బౌలర్ ఎవరనేది చూడకుండా వచ్చిన బంతులను వచ్చినట్లే బౌండరీలకు పంపగల సమర్దుడు. బీసీసీఐ ఎంపికను చూస్తే సీనియర్లను కాదని ఎక్కువ జూనియర్లకే అవకాశం ఇచ్చింది. రానున్న రోజుల్లో క్రికెట్‌ను ఎలేదని కుర్రాళ్లే కావడంతో సెలక్టర్లు యంగ్ బ్యాటర్లకు అవకాశం ఇచ్చినట్లు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి యంగ్ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని, దీంతో యువకులు ఎన్ని రంజీ మ్యాచ్‌లు ఆడారనేది పట్టించుకోకుండా వారి ప్రతిభను గుర్తుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తీసుకుంటున్నట్లు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ముగ్గురి క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #bcci #ashwin #shikhar-dhawan #world-cup #bhuvneshwar-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి