Dhruv Rathee: జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్‌ రాఠీ

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్ హత్యాచారం ఘటనపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్‌ రాఠీ జస్టీస్ ఫర్ నిర్భయ2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో ధ్రువ్‌రాఠీ టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

New Update
Dhruv Rathee: జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్‌ రాఠీ

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్‌ రాఠీ ఈ ఘటనపై ఎక్స్‌ లో అప్‌లోడ్ చేసిన పోస్టుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా డాక్టర్‌ హత్యాచారం కేసుకు సంబంధించి ధ్రువ్‌ రాఠీ ఎక్స్‌లో జస్టీస్ ఫర్ నిర్భయ 2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో చాలామంది నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. ధ్రువ్‌ రాఠీ.. టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయి ఆ పోస్టును డిలీట్ చేశాడంటూ ఆరోపించారు.

ఆ తర్వాత ధ్రవ్‌ రాఠీ ఈ పోస్టు ఎందుకు డిలీట్ చేశానో వివరణ ఇచ్చాడు. డాక్టర్ హత్యాచారం కేసుకి నిర్భయ కేసుకి తేడాలున్నట్లు తన ఫాలోవర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని అందుకే డిలీట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనను తాను సమర్థించుకున్నప్పటికీ.. ధ్రువ్‌ రాఠీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. డాక్టర్‌ హత్యాచారానికి సంబంధించిన పోస్టుల్లో హ్యాస్‌ట్యాగ్‌తో పాటు బాధితురాలి పేరును కూడా ప్రస్తావించాడు. రేప్ బాధితురాలి పేరును బయటపెట్టడం చట్టవిరుద్ధం అంటూ నెటిజన్లు అతడిపై విమర్శలు చేస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది.
భారత్‌లో.. అత్యాచార బాధితురాలికి సంబంధించి సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలు పెట్టింది. ఈ గైడ్‌లైన్స్‌ ప్రకారం.. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును బయటపెట్టకూడదు. బాధితురాలి బంధువుల అంగీకారంతో కూడా బయటపెట్టకూడదు. ఇలా అత్యాచారానికి గురైన బాధితురాలు, ఆమె కుటుంబం గౌరవానికి భంగం కలగకుండా రక్షించేందుకే ఇలా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.

ఇదిలాఉండగా.. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ ఆస్పత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఓ మహిళా జూనియర్‌ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో గ్యాంగ్‌ రేప్ కూడా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

కీచక ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. కోర్టు ఎన్నేళ్లు జైలు శిక్ష విధించిందంటే?

చదువు చెప్పాల్సిన గురువు విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన విజయవాడలోొ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోర్టు ఆ ఉపాధ్యాయుడికి పదేళ్ల శిక్ష విధించింది. అలాగే రూ.10 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.3 లక్షలు అందజేయాలని కోర్టు ఆదేశించింది.

New Update
8 Arrested For Raping 13-Year-Old Sikkim Girl For Months

Vijayawada

చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

రూ.3 లక్షలు నష్టపరిహారంగా..

దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సెల్‌ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఇదిలా ఉండగా.. మైనర్ బాలిక గర్భం దాల్చిన కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీ యువకుడితో లేచిపోయిన ఆమెకు ప్రెగ్నెంట్ కావడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అయితే బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది కాబట్టి ఈ కేసులో యువకుడికి బెయిల్ మంజూరు  చేసింది న్యాయస్థానం. ఈ ఘటన 2020లో జరగగా తాజాగా కేసు విచారించిన ముంబై హైకోర్టు.. కీలక తీర్పు వెల్లడించింది. నవీ ముంబైకి చెందిన మైనర్ బాలిక 2020లో యూపీ యువకుడితో లేచిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో తిరిగి ఇంటికి వచ్చింది.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

విషయం గమనించిన మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  ఈ కేసును సోమవారం విచారించిన న్యాయస్థానం..'బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరిగిందో ఆమెకు తెలుసు. కాబట్టి ఈ కేసులో అతినికి బెయిల్ మంజూరు చేయాల్సిందే' అని స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

 

 

Advertisment
Advertisment
Advertisment