Andhra Pradesh: వల్లభనేని వంశీ ఎక్కడ?

ఎన్నికల ముందు వరకు టీడీపీ, చంద్రబాబు ఫ్యామిలీలను తిట్టిన వల్లభనేని వంశీ.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వంశీ టీడీపీ కార్యాలయం దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అతని గురించి మరోసారి మాట్లాడుకుంటున్నారు.

New Update
Andhra Pradesh: వల్లభనేని వంశీ ఎక్కడ?

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికలకు ముందు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీని, చంద్రబాబు ఫ్యామిలీని నానా రకాలుగా తిడుతూ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చారు. అయితే ఎన్నికలు అయిన తర్వాత వంశీ ఒక్కసారిగా మాయం అయిపోయారు. రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి అతను ఒక్కసారి కూడా కనిపించలేదు. తాజాగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వల్లభనేని అనుచరులను అరెస్ట్ చేయడంతో వంశీ మళ్ళీ తెర మీదకు వచ్చారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వల్లభనేని వంశీ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వంశీ ఏ71వ నిందితుడిగా ఉన్నారు. దీని మీద విచారణ చేసిన హైకోర్టు వంశీ మీద ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తొందరపడి చర్యలు తీసుకోవద్దని చెప్పింది.

మరో వైపు వంశీ ఎక్కడున్నారంటూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికలు అయిన దగ్గర నుంచీ ఆయన కనిపించ లేదు. కానీ ఇటీవల వంశీ అనుచరులు అరెస్టు అయినప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్‌ చేశారంటూ హంగామా నడిచింది. చివరికి ఆయన దొరకలేదంటూ పోలీసులు క్లారిఫికేషన్‌ ఇచ్చారు. ఈనేపథ్యంలో వంశీ ఎన్నికల తర్వాత అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. తన బెయిల్ పిటిషన్‌ను కూడా అక్కడి నుంచే దాఖలు చేశారని చెబుతున్నారు.

ఇక వంశీ మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పారిపోయాడని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ టార్గెట్ లిస్ట్‌ టాప్‌లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ఉందంటూ ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌ విస్తృత ప్రచారం సాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద విపరీతంగా విరుచుకుపడడమే కారణమని అంటున్నారు. వంశీ విలువలు కూడా మర్చిపోయి మాట్లాడడం వలన హిట్ లిస్ట్‌లో చేరారని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు