IPL 2024: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో ఐపీఎల్ రెండో ఎడిషన్ ఎక్కడ!

సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

New Update
IPL 2024: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో ఐపీఎల్ రెండో ఎడిషన్ ఎక్కడ!

సార్వత్రిక ఎన్నికల తేదీలు వచ్చేసాయి. బీసీసీఐ ఏప్రిల్ 7 వరకు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లు యూఏఈ లోనే జరుగుతాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ 2024 రెండో ఎడిషన్   మ్యా చ్‌లు యూఏఈలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి 22న ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. BCCI ప్రకటించిన షెడ్యూల్‌ ఏప్రిల్‌ 7తో ముగుస్తుంది. నేడు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ఆధారంగా మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతాయో లేదా తేలిపోనుంది. ఐపీఎల్ 2024కు మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వాహకులు తొలి 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ముగియనుంది. ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత.. ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది.

అయితే,  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత విషయంలో తలెత్తే ెె ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.భారత ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా ఐపీఎల్ 2024లో ద్వితీయార్థం మ్యాచ్‌లను దుబాయ్‌కి తరలించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు