WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ అప్‌డేట్.. ఇక ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు! ఎలాగంటే? వాట్సాప్ త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. వాట్సాప్ మెసేజీలను ఏ భాషలోకైనా ట్రాన్స్‌లేట్ చేసుకునే ఆప్షన్‌ను వాట్సాప్ కల్పించనుంది. ముందుగా ఇంగ్లీష్, హిందీ, అరబిక్ సహా కొన్ని భాషలకు సపోర్ట్ ఇచ్చేలా ఫీచర్ రానుంది. తర్వాత మిగిలిన భాషలకు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ ఇస్తుంది. By Trinath 14 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ ఉంటుంది. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. గతంలో ట్రాన్స్‌క్రైబింగ్ వాయిస్ నోట్స్ ఫీచర్‌ని తీసుకొచ్చిన వాట్సాప్ ఈసారి చాటింగ్ టెక్ట్స్‌లను ట్రాన్స్‌లేట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. దీని ప్రకారం వాట్సాప్‌లో కొత్త లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను సంస్థ అభివృద్ధి చేసే పనిలో ఉంది. 📝 WhatsApp beta for Android 2.24.15.9: what's new? WhatsApp is working on a feature to translate all chat messages, and it will be available in a future update!https://t.co/Nz2qabck6K pic.twitter.com/EPD9DRPyo1 — WABetaInfo (@WABetaInfo) July 12, 2024 ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఈ ఫీచర్ మొదట హిందీ, ఇంగ్లీష్ భాషలలో మాత్రమే పని చేస్తుందని తెలుస్తోంది. తర్వాత నెక్ట్స్ అప్‌డేట్ టైమ్‌కు ఇతర భాషలకు సపోర్ట్ చేయవచ్చు. ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి యూజర్‌లు లాంగ్వేజ్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేయాల్సిరావచ్చు. ఈ ట్రాన్స్‌లేషన్ చాట్‌లలో అటోమేటిక్‌గా జరుగుతుంది. వినియోగదారులకు ఏ థర్డ్ పార్టీ యాప్‌ల సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఛాట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవడానికి ఇతర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే వాట్సాప్ అందించే కొత్త ఫీచర్‌తో అటోమెటిక్‌గా వాట్సాప్‌గా చాట్స్‌ను ట్రాన్స్‌లేట్ చేయగలదు. అయితే ఇంగ్లీష్, హిందీతో పాటు అరబిక్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ సహా కొన్ని భాషలకు మొదటి అప్‌డేట్‌లోనే ట్రాన్స్‌లేషన్ కల్పించాలని మెటా భావిస్తోంది. ఒక వేళ ఇన్ని భాషలు మొదటి అప్‌డేట్‌లో సాధ్యం కాకున్నా హిందీ, ఇంగ్లీస్ మాత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా పని చేస్తుంది? ఏదైనా మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేయడానికి వినియోగదారులు ఆ టెక్ట్స్‌పై కాసేపు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు స్క్రీన్‌పై కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ట్రాన్స్‌లేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సంబంధిత చాట్ టెక్ట్స్ వెంటనే ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఒకవేళ మీరు చాలా మెసేజీలను ఒకసారే సెలక్ట్ చేసుకోని ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఒకేసారి ఆ చాట్స్ అన్నీ ట్రాన్స్‌లేట్ అవుతాయి. Also Read: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్ నుంచి ట్రంప్ వరకు.. ! #whatsapp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి