WhatsApp: ఇలా చేస్తే అర్జెంట్ మెసేజ్‎లు అస్సలు మిస్సవ్వరు.. వాట్సాప్‎లో కొత్త ఫీచర్

ఎప్పటికప్పుడు అప్ డేట్లతో యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాట్సాప్ నుంచి మరో ఫీచర్ వచ్చింది. వాట్సాప్ సరికొత్తగా తెచ్చిన ఈ ‘పిన్’ ఫీచర్ ను ఉపయోగిస్తే ముఖ్యమైన సందేశాలను మిస్సవకుండా ఉండొచ్చు. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

New Update
WhatsApp: ఇలా చేస్తే అర్జెంట్ మెసేజ్‎లు అస్సలు మిస్సవ్వరు.. వాట్సాప్‎లో కొత్త ఫీచర్

WhatsApp new feature: ఎప్పటికప్పుడు అప్ డేట్లతో యూజర్లకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే వాట్సాప్ నుంచి మరో ఫీచర్ వచ్చింది. వాట్సాప్ లో పదుల సంఖ్యలో ఉండే గ్రూపుల్లో రోజూ వందలు, వేల కొద్దీ మెసేజ్ లు వస్తూనే ఉంటాయి కదా. అయితే, వాటన్నింటినీ చదవడం ఎవరికి మాత్రం సాధ్యపడుతుంది! వాటిలో ముఖ్యమైన, అందరికీ ఉపయోగకరమైన మెసేజ్ లు కూడా ఒక్కోసారి స్కిప్ అవుతుంటాయి. ఇప్పుడు వాట్సాప్ సరికొత్తగా తెచ్చిన ‘పిన్’ ఫీచర్ ను ఉపయోగిస్తే అలా ఇంపార్టెంట్ మెసేజ్‎లను మిస్సవకుండా ఉండొచ్చు.

ఇది కూడా చదవండి: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. డిసెంబర్ 31 లోపు ఆపని చేయకపోతే డబ్బులు రావు

పర్సనల్ చాట్‌లు, గ్రూప్ చాటింగ్స్ లో ముఖ్యమైన మెసేజీలు మిస్సవకుండా ఉండేలా వాట్సాప్ ‘పిన్’ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఆయా గ్రూపుల అడ్మిన్లు పిన్ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు. టెక్ట్స్ మెసేజ్‌లు మాత్రమే కాదు; పోల్స్, ఫొటోలు, ఎమోజీలను కూడా ‘పిన్’ చేసుకోవచ్చు. అదే పద్ధతిలో అన్ పిన్ కూడా చేసుకోవచ్చు. అలా పిన్ చేసిన మెసేజ్ చాటింగ్ టాప్‌లో కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: డబ్బు, హోదా అక్కర్లేదు.. ఇలా చేస్తే మీ లైఫంతా హ్యపీనే..!

ఎన్ని రోజులుంటాయి?
పిన్ చేసిన మెసేజ్‌లు డీఫాల్ట్ గా ఏడు రోజుల పాటు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఒక రోజు నుంచి 30 రోజుల వరకూ పిన్ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మెసేజ్ అన్ పిన్ అయిపోతుంది. మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ‘మోర్ ఆప్షన్స్’ మీద క్లిక్ చేస్తే ‘పిన్’ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ కొందరికి ఇప్పటికే అందుబాటులోకి రాగా, త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు