వాట్సాప్‌ లోనే బస్సు టికెట్‌ జారీ..మెట్రో లాగే..ఎక్కడంటే!

ఢిల్లీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్‌ చెప్పింది. బస్సు టికెట్లను వాట్సాప్ ద్వారా పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే అక్కడ మెట్రో టికెట్లు వాట్సాప్ లో అందుబాటులో ఉన్నాయి.

New Update
వాట్సాప్‌ లోనే బస్సు టికెట్‌ జారీ..మెట్రో లాగే..ఎక్కడంటే!

ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే వాట్సప్‌ టికెట్‌ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే బస్సు ప్రయాణికులు కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం.

ఇక మీదట బస్సు ప్రయాణం చేసే వారికి కూడా టికెట్లను వాట్సాప్‌ ద్వారానే అందించాలని యోచిస్తుంది. ఈ ఏడాది మేలో మెట్రో రైల్ కార్పొరేషన్‌ ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందకు వాట్సాప్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది.

దీనికి ప్రయాణికుల నుంచి విశేషమైన ఆదరణ లభించడంతో దానిని చాలా మార్గాల్లో అమలు చేస్తుంది. అయితే వాట్సాప్ ద్వారా టికెట్ల కొనుగోలు చేయాలంటే కొంద పరిమితి ఉంటుంది. త్వరలోనే వాట్సాప్‌ లో బస్సు టికెట్‌ జారీ చేస్తామని రవాణా శాఖాధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లలో క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయవచ్చు..లేకపోతే 9650855800 కి వాట్సాప్ మెసేజ్‌ చేయాలి.

ఇలా వాట్సాప్‌ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ ను రద్దు చేసుకునే వీలు లేదు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. మార్జినల్ కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తారు. యూపీఐ పేమెంట్స్‌కు మాత్రం అదనపు రుసుము ఉండదు.

Also read: పేరేంట్స్…అమ్మాయిలను గౌరవించేలా అబ్బాయిలను ఎలా పెంచాలో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు