WhatsApp : 76 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా? వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 02 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి WhatsApp Accounts Ban : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) ఫిబ్రవరిలో భారీగా వాట్సాప్ అకౌంట్స్ ను నిషేధించింది. ఐటి రూల్స్ 2021ని ఉల్లంఘించినందుకు ఫిబ్రవరి నెలలో 76 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు మెటా(Meta) యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌కు భారతదేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో దేశంలో రికార్డు స్థాయిలో 16,618 ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అంతకుముందు జనవరి నెలలో 6,728,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య 76,28,000అకౌంట్లను నిషేధించినట్లు తన నెలవారీ రిపోర్టులో పేర్కొంది. వీటిలో 14,24,000అకౌంట్స్ పై ఎలాంటి ఫిర్యాదులు అందకున్నా ఐటీ(IT) నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా 50కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నవాట్సాప్ కు ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 16,618 వినతులు వచ్చాయి. వాటిలో 22 అకౌంట్స్ పై మాత్రమే యాక్షన్ తీసుకున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. అకౌంట్స్ యాక్షన్ అంటే వాట్సాప్ రిపోర్టు ఆధారంగా ఆ అకౌంట్స్ ను బ్యాన్ చేయడం లేదా గతంలో బ్యాన్ చేసిన అకౌంట్స్ ను యాక్టివేట్ చేయడం వంటి చర్చలు చేపట్టే ప్రక్రియ. ఎలాంటి చర్యలతో వాట్సాప్ అకౌంట్ బ్యాన్ చేస్తుంది: -ఏ సందేశాన్ని ఫార్వార్డ్ చేయవద్దు. -క్రాస్ చెక్ చేసిన తర్వాతే నకిలీ సందేశాన్ని ఫార్వార్డ్ చేయండి. -ఎవరి గోప్యతను ఉల్లంఘించే సందేశాలను పంపవద్దు. -చంపేస్తానని లేదా ప్రాణహాని చేస్తానని బెదిరింపు సందేశాలు పంపవద్దు. -ఎవరికీ వేధించే సందేశాలు పంపవద్దు. పొరపాటున మీ అకౌంట్ బ్యాన్(Account Ban) అయితే మీ వాట్సాప్ ఇమెయిల్ ద్వారా రివ్యూను రిక్వెస్ట్ చేయండి. దీన్ని చేసేందుకు మీరు ఎస్ఎంఎస్ ద్వారా 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ ను నమోదు చేసుకోవాలి. దీని తర్వాత మీ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కొన్ని పత్రాలను కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి : రైల్వేలో 9వేలకు పైగా ఉద్యోగాలు..మరో ఆరు రోజులే గడువు..అప్లయ్ చేశారా? #whatsapp #meta #whatsapp-fake-accounts #whatsapp-fake-accounts-ban మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి