What's Wrong With India : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!

'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇండియా టార్గెట్‌గా కొందరు విదేశీయులు భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రియాక్ట్‌ అయిన ఇండియా స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
What's Wrong With India : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!

What's Wrong With India : అవతలి వారిని అనేముందు మన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. ఇతరుల తప్పులను వెతికే ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇది అందరికీ వర్తించే విషయం. లోపాలు లేని దేశం, ప్రాంతం ఈ భూమండలం మీద లేదు. అయితే విదేశీయులకు మాత్రం ఇండియా(India) ను ఎగతాళి చేయడమంటే అదో సరదా. సిగ్నల్ ప్రోటోకాల్‌లను పాటించకపోవడం, నిబంధనలు లేదా క్యూలను ఉల్లంఘించడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, బిచ్చగాళ్లు, ఈవ్ టీజింగ్(Eve Teasing), తాగి వాహనాలు నడపడం లాంటి అనేక సామాజిక, పౌర లోపాల వల్ల భారతీయులను పొరుగు దేశాల వారు చాలా సార్లు ప్రశిస్తూ ఉంటారు. అయితే ఇవన్ని కేవలం ఇండియాలోనే లేవు కదా. తాజాగా ఇండియాను టార్గెట్‌గా చేసుకోని సోషల్‌మీడియా(Social Media) లో పలువురు ఎగతాళి చేస్తున్నారు. మోసం, అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో నిండిపోయిన అమెరికా(America) ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఇదే విషయాన్ని భారతీయులు ఎత్తి చూపుతున్నారు. విదేశీయులకు కౌంటర్లు ఇస్తున్నారు. '#whatswrongwithindia' హ్యాష్‌ ట్యాగ్‌ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ హ్యాష్‌ ట్యాగ్‌ చుట్టూ కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి.


అసలేంటి మేటర్:
సోషల్ మీడియా వినియోగదారుల్లో ఒకరు 'what's wrong with India(భారతదేశంలో తప్పు ఏమిటి)' అని వ్యంగ్యంగా ఓ చిత్రాన్ని పోస్ట్ చేశారు. పేదలు వీధుల్లో నివసించడం, ప్రజా పరిశుభ్రత పద్ధతులు, పేదరికం మొదలైన వాటిపై భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు వేశారు. అయితే ఇలా ఇండియాను టార్గెట్‌గా పోస్ట్ చేసిన వీడియోల్లో చాలా వరకు భారత్‌కు చెందినవి కావు. ఆఫ్రికా దేశాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఇండియా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇండియన్‌ ట్విట్టర్‌ యూజర్లకు కోపం వచ్చింది. కౌంటర్లు ఇవ్వాలని భావించిన నెటిజన్లు విదేశీయులకు గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు.

publive-image

స్పందించిన ప్రభుత్వం:
'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ భారత్‌ ప్రభుత్వం కంట పడింది. దీంతో ప్రభుత్వం తన అధికారిక హ్యాండిల్ MyGovIndia ద్వారా స్పందించింది. దేశం సాధించిన ఇటీవలి విజయాలను హైలైట్ చేసే వార్తల క్లిప్పింగ్‌లను కలిగి ఉన్న నాలుగు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ క్లిప్పింగ్‌లు భారత్‌ సాధించిన విజయాలను ప్రదర్శించాయి. ఇందులో 'పేదరికం' విజయవంతంగా నిర్మూలించామని చెప్పారు. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి దేశం మనదేనని ఇండియా చెప్పుకొచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా IMF చీఫ్ నుంచి ప్రశంసలు అందుకోవడాన్ని కూడా ఇండియా పాయింట్‌ అవుట్ చేసింది.

Also Read: ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.. కానీ..

Advertisment