సన్ రైజర్స్,రాజస్థాన్ మ్యాచ్ కు.. వర్షం అడ్డంకిగా మారితే..ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.

New Update
సన్ రైజర్స్,రాజస్థాన్ మ్యాచ్ కు.. వర్షం అడ్డంకిగా మారితే..ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 3 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. క్వాలిఫైయర్ 2 కోసం ఏ రిజర్వ్ డే ఉంచబడింది? వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే ఫైనల్‌కు చేరే మరో జట్టు ఎవరు? ప్లేఆఫ్ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (RR vs SRH) జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్ జరిగే రోజు చెన్నైలో వర్షం వచ్చే సూచన లేదు. రోజంతా ఆకాశంలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉన్న మాట వాస్తవమే కానీ వర్షం విషయానికొస్తే 2 శాతం అవకాశం ఉంది. రోజు గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. చెన్నై పిచ్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.ముఖ్యంగా స్పిన్నర్లకు ఇక్కడ మరింత సహాపడుతుంది. స్పిన్‌కు అనుకూలమైన వికెట్‌పై ఇక్కడ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా మారనుంది. ఇక్కడ స్పిన్నర్లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు.

టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇటీవలి కాలంలో ఇక్కడ 7 మ్యాచ్‌లు ఆడిన ఛేజింగ్‌ జట్టు 5 గెలిచింది. ఇరు జట్లు 19 సార్లు తలపడగా హైదరాబాద్‌ 10, రాజస్థాన్‌ 9 మ్యాచ్‌లు గెలిచాయి.

  • రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే IPL 2024 క్వాలిఫైయర్ 2 కోసం రిజర్వ్ డే లేదు.
  • మ్యాచ్‌ మధ్య లో వర్షం అంతరాయం కలిగితే, 5-5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించడానికి అంపైర్‌కు 120 నిమిషాల సమయం ఉంటుంది.
  • మ్యాచ్‌లో 5-5 ఓవర్లు కూడా ఆడకపోతే, సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్నినిర్ణయిస్తారు.
  • వర్షం కురుస్తూనే ఉండి సూపర్ ఓవర్ నిర్వహించలేకపోతే, పాయింట్ల పట్టిక ఆధారంగా విజేత జట్టును నిర్ణయిస్తారు. ఈ రెండు జట్లలో పాయింట్ల పట్టికలో ఎక్కువ సంఖ్యలో ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అంటే హైదరాబాద్ కు ఈ విధంగా ఫైనల్ టిక్కెట్ దక్కుతుంది. ఎందుకంటే లీగ్‌ను రెండో స్థానంలో ముగించగా, రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది.
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment