/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AV-Subba-Reddy-Akhila-Priya-.jpg)
Bhuma Akhila Priya Next Step Over AV Subba Reddy : తన బాడీగార్డ్(Body Guard) పై దాడితో మాజీ మంత్రి అఖిలప్రియ(Akhila Priya) షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy) వర్గీయులు అటాక్ చేస్తారని అఖిల ఏ మాత్రం ఊహించలేదని తెలుస్తోంది. పైగా తన ఇంటి ముందే దాడి జరగడంతో ఆమె వర్గం ఉలిక్కిపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామంతో అఖిల ఎలా రియాక్ట్ అవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దాడి తర్వాత పోలీసులకు కత్తి దొరికొంది. అఖిల బాడీగార్డ్ నిఖిల్‌ను చంపడం కోసం రూ.50 లక్షల సుపారీ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. లోకల్ రౌడీషీటర్లు(Local Rowdy Sheeters) దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి తెగబడ్డారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?
ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు నంద్యాల పోలీసులు(Nandyal Police). అయితే.. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు అఖిల విముఖత చూపుతున్నారు. దీంతో అఖిల మౌనానికి కారణం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. అఖిల ప్రతికారం తీర్చుకుంటారా? ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.