Health Insurance : షుగర్ పేషంట్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం... ఎలా పొందాలి? పూర్తివివరాలివే..!!

షుగర్ ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. షుగర్ పేషంట్లు ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కూడా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ పాలసీ, షుగర్ ఇన్సూరెన్స్ లాంటి బీమాను కొనుగోలు చేయవచ్చు.

New Update
Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు

Diabetes Insurances : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలోని 463 మిలియన్ల మంది..మనదేశంలో 77మిలియన్ల మంది షుగర్ తో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే షుగర్ అనేది ఈ రోజులు తీవ్రమైన సమస్యగా మారింది. అయితే షుగర్ కు సరైన చికిత్స చాలా అవసరం. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహాలు సూచనలు కూడా పాటిస్తుండాలి.

షుగర్(Diabetes) ఎన్ని రకాల వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. వీరు ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు రిటైర్ మెంట్ కు దగ్గరపడుతున్పుడు ఆరోగ్య బీమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న వయస్సులో బీమా చేయించుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీకు డబ్బును ఆదా చేయడమే కాదు..అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య బీమా మీకు సహాయం చేస్తుంది. డయాబెటిస్ పేషంట్లు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం.

ఆరోగ్య బీమా పాలసీ:
చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు షుగర్ రోగులకు కూడా హెల్త్ పాలసీల(Health Insurance)ను అందిస్తున్నాయి. కానీ ఇలాంటి పాలసీల్లో కవరేజ్ ప్రారంభం అయ్యే ముందు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే సాధారణంగా 2 నుంచి 4ఏళ్ల వరకు ఉంటుంది. కొత్త పాలసీదారులు పలు రకాల వైద్య పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది.

గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ :
కంపెనీలు ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తాయి. దీనిలో షుగర్ కూడా ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ బీమాను పొందే ముందు చెక్ చేసుకోవాలి.

షుగర్ కోసం సరైన ఇన్సూరెన్స్:
షుగర్ పేషంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఎన్నో బీమా కంపెనీలు వారి కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీలను ప్రారంభించాయి. ఇవి షుగర్ పేషంట్లకు సౌకర్యాలను కల్పిస్తాయి.

బీమా తీసుకునే ముందు ఈ విషయాలను పరిగణలోనికి తీసుకోండి:
షుగర్ పేషంట్లు వెయింటింగ్ పీరియడ్ పై ఎక్కువగా శ్రద్దపెట్టాలి. ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు వారికి తక్కువ వేయింటింగ్ పీరియడ్ మంచిది. కో పేమెంట్స్ అండ్ పరిమితులపై కూడా శ్రద్ద తీసుకోవాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసిన తర్వాత కూడా మీ అకౌంట్లో డబ్బు లేనట్లయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్య లేనట్లయితే బీమాను కొనుగోలు చేసే ముందు మీరు అన్ని ఆరోగ్య సమస్యల గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. ఏదైనా బీమా పాలసీని తీసుకునేముందు అది షుగర్ కవర్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి.

టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ సాధారణంగా పాలసీలో కవర్ చేయరు. కానీ పాలసీలో టైప్ 3 ఇంగా గర్భధారణ మధుమేహం చాలా అరుదుగా ఉంటుంది. గర్భధారణ మధుమేహం ప్రసూతి ప్రయోజనాల కింద కవర్ చేస్తారు.

ఇది కూడా చదవండి: కొత్త ఏడాది నుంచి డబ్బు, ఖర్చులు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు