Ears Pierced : పిల్లలకు ఏ వయసులో చెవులు కుట్టించాలి?

శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చిన తరువాత స్వర్ణకారుడు, క్లినిక్, పార్లర్ లేదా ఆ రంగంలో నిపుణులతో చెవులు కుట్టిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చెవులు కుట్టిస్తే సంప్రదాయంతో పాటు.. మధుమేహం, ఇతర వ్యాధులు కూడా దరిచేరవని అంటున్నారు.

New Update
Ears Pierced : పిల్లలకు ఏ వయసులో చెవులు కుట్టించాలి?

Kids : హిందూమతంలో అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా చెవులు కుట్టించుకుంటారు(Ears Pierced). హిందూమతంలోని 16 ఆచారాలలో కర్ణ-వేద ఆచారం ఒకటి. చెవులు కుట్టడానికి శాస్త్రీయ, మతపరమైన కారణాలు రెండూ ఉన్నాయి. చెవి కుట్టించుకుంటే పక్షవాతం, మధుమేహం, హెర్నియా(Hernia) వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నమ్ముతారు. శిశువు పుట్టిన 16 రోజుల తర్వాత లేదా మూడు నెలల తర్వాత సౌకర్యాన్ని బట్టి చెవులు కుట్టిస్తారు. ఈ కార్యక్రమాన్ని వేడుకగా చేస్తారు. చెవులు కుట్టడం వలన కలిగే లాభాలేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఏ వయసులో చెవులు కుట్టించాలి?

  • కొన్ని సంప్రదాయాలలో శిశువుకు పుట్టినప్పుడు చెవులు కుట్టిస్తారు. కొందరు తల్లిదండ్రులు ఆ వయసులో చెవులు కుట్టిస్తే ఏమన్నా జరుగుతుందేమోనని, ఏ వయసులో కుట్టించాలో తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. పుట్టిన కొద్ది రోజులకు శిశువుకు రోగనిరోధక వ్యవస్థ(Immune System) అభివృద్ధి చెందదు, కాబట్టి చెవులు కుట్టడానికి ముందు కొంచెం వేచి ఉండటం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శిశువు చెవులు కుట్టడానికి శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు కుట్టించకూడదని చెబుతున్నారు. మన పెద్దలు మాత్రం పుట్టిన తర్వాత 16వ రోజు లేదా మూడు నెలల వరకు ఎప్పుడైనా చెవులు కుట్టవచ్చంటున్నారు.

శిశువు చెవులు ఎవరు కుట్టాలి?

  • సాంప్రదాయం ప్రకారం స్వర్ణకారుడు శిశువు చెవులను కుడతారు. ఇటీవలి కాలంలో స్వర్ణకారుల కంటే పిల్లల వైద్యుల ద్వారా చెవులు కుట్టిస్తున్నారు. ఎవరుపడితే వారు కాకుండా స్వర్ణకారుడు, క్లినిక్, పార్లర్ లేదా ఆ రంగంలో నిపుణులతో చెవులు కుట్టిస్తే మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు:

  • చెవులు కుట్టిస్తే సంప్రదాయంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) కూడా ఉన్నాయి. ఆక్యుపంక్చర్ థెరపీ ప్రకారం, మధుమేహం, ఇతర వ్యాధులు కూడా దరిచేరవని చెబుతున్నారు.

ముఖ్యమైన జాగ్రత్తలు:

  • పిల్లలకు చెవి కుట్టిన తర్వాత ఆ వైపుగా తలపెడితే.. దిండులో పోగైన బ్యాక్టీరియా చెవిపై ప్రభావం చూపుతుంది. చెవి మీద తీవ్ర ఒత్తిడి పడకుండ చూసుకోవాలి. వాపు, గాయం ఎక్కువగా ఉంటే పసుపు పూసుకోవాలి. నొప్పి అధికంగా ఉన్న వేపపుల్ల పెట్టుకున్న ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: అర్థరాత్రి చెవి నొప్పి వచ్చిందా..ఇలా చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: మన శరీరంలో కాల్షియం పెరగాలంటే ఏం చేయాలి?

Advertisment
Advertisment
తాజా కథనాలు