/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1.jpg)
West Indies VS Papua New Guinea : వెస్టిండీస్ (West Indies) ఒకప్పుడు చాలా పెద్ద టీమ్ అయినా... ఇప్పుడు మాత్రం ఆటగాళ్ళు లేక కష్టాలుపడుతోంది. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) లో ఆడుతున్న వెస్టీండీస్ నిన్న తన మొదటి మ్యాచ్‌ను ఆడింది. పపువా న్యూగినియాతో ఆడిన మ్యాచ్‌లో నెగ్గడమైతే నెగ్గింది కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది. గ్రూప్ సి లో పసికూన పపువా న్యూగిని (Papua New Guinea) తో జరిగిన మ్యాచ్ లో విండీస్ శుభారంభం చేసింది. 137 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మరోవైపు పపువా న్యూగినియా ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగు పెట్టింది. వరల్డ్‌కప్‌లో ఇదే మొదటిసారి ఎంట్రీకూడా. అయినా కూడా ఆ పసికూన జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడింది. ఓడిపోయినా అందరి చేతా శభాష్ అనిపించుకుంది. రోస్టన్ ఛేజ్ 27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రాండన్ కింగ్ 29 బంతుల్లో 34; 7 ఫోర్లతో మెరిసాడు. న్యూగిని బౌలర్లలో అసద్ 2 వికెట్లు తీశాడు.
ఇక వెస్టిండీస్ జట్టులో మొదటి వికెట్ ఆరంభంలోనే కోల్పోయింది. చార్లెస్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కానీ తర్వాత నికోలస్ పూరన్ బాధ్యతను తన భుజాల మీద వేసుకుని బ్రాండన్ కింగ్‌తో కలిసి 53 పరుగులు అందించాడు. పూరన్ 27 పరుగులు చేశాడు. కానీ ఆ తరువాత మళ్ళీ విండీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. దాంతో 97 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. అయితే చేజ్, రస్సెల్ (15 నాటౌట్) మరో వికెట్ పడకుండా విండీస్ ను గెలిపించారు.
Also Read:ఏపీలోకి రుతుపవనాలు…ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!