బరిలోకి దూకుతున్న తెలుగు కుర్రాడు.. ఇవాళ్టి నుంచి విండీస్‌తో టీ20 ఫైట్!

వన్డే, టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ని మట్టికరిపించిన టీమిండియా టీ20 ఫార్మెట్‌కి సిద్ధమైంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సరీస్‌లో భాగంగా ఇవాళ(ఆగస్టు 3) ట్రినిడాడ్‍లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో ఫస్ట్ టీ20 మ్యాచ్‌ జరగనుంది. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుండగా.. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ టీ20ల్లో అరంగ్రేటం చేసే అవకాశముంది.

New Update
బరిలోకి దూకుతున్న తెలుగు కుర్రాడు.. ఇవాళ్టి నుంచి విండీస్‌తో టీ20 ఫైట్!

India vs West Indies T20: టెస్టు సిరీస్‌ గెలిచేశాం.. వన్డే సిరీస్‌ ఊదేశాం.. ఇక మిగిలింది పొట్టి ఫార్మెట్‌ టీ20లు. ఇందులో విండీస్‌(West Indies) టీమ్‌ని తక్కువ అంచనా వేస్తే బొక్క బొర్లా పడడం ఖాయం. ఎందుకంటే వన్డే, టెస్టుల్లో కరీబియన్‌ జట్టు ఆట తీరు వేరు.. టీ20ల్లో వేరు.. ప్రస్తుతం కాస్తో కూస్తో ఆ జట్టు గొప్పగా ఆడే ఫార్మెట్ ఇది మాత్రమే. వన్డే సిరీస్‌లో ప్రయోగాలు చేసిన టీమిండియా(Team India).. టీ20ల్లోనూ అలానే చేస్తే ఓటమి తప్పదు. అందుకే తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం. అదే సమయంలో యువ ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే..! టీ20 అంటేనే కుర్రాళ్ల ఫార్మెట్‌ అని పేరుంది. ఇక ఇప్పటివరకు వన్డే, టెస్టుల్లో ఛాన్స్‌ రాని వాళ్లని టీ20లో ఆవకాశమివచ్చు. టీ20లే వారికి బెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌. ఇక్కడ రాణిస్తే తర్వాత వన్డే, టెస్టు జట్టులో చోటు సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇవాళ(ఆగస్టు 3) విండీస్‌తో తొలి టీ20 ఫైట్‌కి టీమిండియా రెడీ అయ్యింది. భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ఇవాళ ట్రినిడాడ్‍లోని(Trinidad) బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరగనుంది. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

తిలక వర్మ్‌ ఎంట్రీ ఫిక్స్:
గత రెండు ఐపీఎల్‌ సీజన్లగా తెలుగు బిడ్డ తిలక్‌ వర్మ(Tilak Varma) అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్ లాంటి బ్రాండ్‌ జట్టులో చోటు సంపాదించుకోవడమే గొప్ప అనుకునే సమయంలో తిలక్ వర్మ ఆ జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నాడు. ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు. తిలక్‌ ఆడకపోతే మ్యాచ్‌ ఓడిపోతుందన్న భావన కూడా ముంబై ఇండియన్స్ అభిమానుల మనసుల్లో ఉందంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంబానీ జట్టుకు ఆపద్బాంధవుడుగా క్రికెట్ దిగ్గజాల చేత ప్రశంసలందుకున్న తిలక్‌ అరంగ్రేటం దాదాపు ఫిక్స్‌ ఐనట్టే కనిపిస్తోంది. అయితే తొలి మూడు టీ20ల్లో తిలక్‌ని కాకుండా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌ని ఆడించి.. చివరి రెండు టీ20ల్లో తెలుగు కుర్రాడికి అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం 5 టీ20ల సిరీస్‌ కావడంతో రిజర్వ్ బెంచ్‌ మొత్తాన్ని పరీక్షించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్టు సమాచారం.

భారత్ తుది జట్టు (అంచనా) - India vs West Indies (Indian Team Prediction):

యశస్వీ జైస్వాల్, శుభ్‌ మన్ గిల్, సంజూ శాంసన్/ తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ఆవేశ్ ఖాన్.

Also Read: కెప్టెన్‌గా బుమ్రా రీ-ఎంట్రీ, రిస్క్ అవసరమా అంటున్న విశ్లేషకులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు