/rtv/media/media_files/2025/08/19/rains-2025-08-19-07-59-05.jpg)
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త అందించింది. వేసవి తాపానికి చల్లని ఉపశమనం కలిగించే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈ ఏడాది ముందే మే 26 నాటికే ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. కానీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రవేశం కొద్దిగా ఆలస్యమవుతోందని, రానున్న కొన్ని రోజుల్లో ఇవి కేరళ తీరంలో అడుగుపెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు
రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత, అక్కడి నుండి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఈ క్రమంలోనే కేరళలో ప్రవేశించిన వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని IMD స్పష్టం చేసింది.ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతుండటంతో.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా భానుడి భగభగలకు బ్రేక్ పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రాక కోసం రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Follow Us