AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

New Update
rains ap

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. 

ఇది కూడా చూడండి:  వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను

అల్పపీడన ప్రభావం వల్ల ఈ జిల్లాల్లో..

అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

ఇది కూడా చూడండి:  శ్రీతేజ్ ను కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్ సంచలన పోస్ట్

ఇది కూడా చూడండి: ప్రభాస్ తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్..!

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రైతులకు సూచనలు చేశారు. పంట చేతికి వచ్చే సమయం. కాబట్టి పంట కోస్తే వాటిని జాగ్రత్త పరచుకోవాలని తెలిపారు. పంట కోతకు వస్తే ఒక రెండు రోజులు ఆగి కోయాలని సూచించారు. అలాగే మృత్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Weather:  తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

New Update

TG Weather: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర్‌ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.  హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది.  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.

జాగ్రత్తగా ఉండాలి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షాలు పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలెర్ట్ చేసింది. రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే

కొన్ని సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, మరి కొన్ని జిల్లాలో వడగళ్ల వర్షం పడింది.  భారీ వర్షంతో తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదున 2,3  రోజులు రైతులు పొలం పనులకు వెళ్లొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు  ఇంట్లో నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంట్ పోల్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు.

ఇది కూడా చదవండి: కాల్చిన అవిసె గింజలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

( ts-weather | ts-weather-update | latest-news)

Advertisment
Advertisment
Advertisment