Heavy Rains: బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.

New Update
Rains

తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు సమాచారం. కాబట్టి బయటకు వెళ్లే వాళ్లు జాగ్రత్తని అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!

ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్..

నైరుతి బంగాళాఖాతం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాతావరణంలో మార్పులు వల్ల నిన్నటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. 

ఇది కూడా చూడండి: సినిమా లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏపీలో మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నాన్నారు. ఎందుకంటే పొలాల్లో ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే మృత్సకారులు వేటకు వెళ్లవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే!

ఇదిలా ఉండగా.. ఇటీవల దానా తుపాను వచ్చింది. ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటుగా ఏపీలో ఎక్కువగా ఉండేది. ఈ తపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలోని కళింగ పట్నం, భావనపాడు పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉత్తరాంధ్రలో ఈ తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. 

ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.

New Update
india rainfall

india rainfall Photograph: (india rainfall)

2025లో కురిసే వర్షపాత వివరాలు మంగళవారం భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈసారి వర్షకాలం గురించి IMD గుడ్‌న్యూస్ చెప్పింది. ఈఏడాది భారతదేశంలో దీర్ఘకాలిక సగటులో 105 శాతం సగటు కంటే ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. లాంగ్ పిరిడయడ్ యావరేజ్‌లో 105 నుంచి 110% పరిధిలో వర్షపాతాన్ని సగటు కంటే ఎక్కువగా IMD నిర్వచిస్తుంది. ఈ ఏడాది వర్షకాలం సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని మంగళవారం వాతావరణ నిపుణులు తెలిపారు. ఇండియా అంత రుతుపవనాలు వ్యాపించి బలమైన వర్షాలు పడతాయట. IMD అంచనాలకు 5శాతం తక్కువ లేదా ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

IMD Weather Alert In AP & TG

Also read: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!


లడఖ్, ఈశాన్య, తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ మీదుగా దేశంలో వ్యాపించి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయి. ఎల్ నినో, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి కీలక వాతావరణ కారకాలు తటస్థంగా ఉంటాయని, బలమైన రుతుపవనాలు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని IMD అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనట్టుగా భారతదేశంలో సగటు కంటే ఎక్కువ రుతుపవన వర్షాలు పడే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

 

imd alert | heavy-rainfall | Cold Weather | telugu states monsoon | Andhra Pradesh and Telangana Weather Report | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment