AP: 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశాం.. 'వాలంటీర్లకు వందనం' సభలో సీఎం జగన్

గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని  చెప్పారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని, లంచంలేని, వివక్షలేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వారి లక్ష్యం అని తెలిపారు.

New Update
AP: 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశాం.. 'వాలంటీర్లకు వందనం' సభలో సీఎం జగన్

YS Jagan: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. 58 నెలలు అలసిపోకుండా ప్రజలకు సేవ చేశామని  చెప్పారు. వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని తెలిపారు. లంచంలేని, వివక్షలేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల లక్ష్యం అని తెలిపారు.

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం..
అలాగే ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మరో రెండు నెలలు పేదల బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2 లక్షల 60వేలు నా సైన్యం. టీడీపీని అధికారంలోనుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. తాము ఏర్పాటు చేసిన వ్యవస్థలు గ్రామ రూపు రేఖలను మార్చేశాయని, గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. అర్బీకే వ్యవస్థ రైతులకు కొండంత అండగా నిలబడిందని చెప్పారు. ఇది జన్మభూమి కమిటీలు, వాలంటీర్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఈరోజు నుంచి వాలంటీర్లకు అభినందన సభలు జరుపుతామని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Alaska: మర్డర్ లైవ్ వీడియో కోసం బెస్ట్ ఫ్రెండ్ ను చంపిన యువతి.. 99 ఏళ్ల జైలు శిక్ష!

చంద్రబాబు పాలన విష వృక్షం..
గత పాలనలో స్కీమ్ లు లేవు, బటన్ లు లేవు. చంద్రబాబు పాలన విష వృక్షమైతే.. తమ పాలన కల్ప వృక్షమన్నారు. కేంద్రం నుంచి నిధులు లేకున్నా తట్టుకున్నామన్నారు. చంద్రబాబు మెనిఫెస్టో హైదరాబాద్ లో తయారైందని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాదు లోని ఇంట్లో కూర్చుంటారు. వాళ్ల మేనిఫెస్టోలతో కిచిడీ తయారు చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి స్క్రిప్ట్ తెప్పించుకుంటారని ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు