Rahul Gandhi: రాయ్‌ బరేలీ...వయనాడ్‌ రెండింటిలో ఏదంటే!

కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్‌ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్‌ వదులుకుంటారని చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Rahul Gandhi: రాయ్‌ బరేలీ...వయనాడ్‌ రెండింటిలో ఏదంటే!

Rahul Gandhi: తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..అయితే ఆయన రెంఉ చోట్ల కూడా బంపర్‌ మెజార్టీని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయన గురించి చర్చ మొదలైంది.
కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీలో.. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్‌ విజయం సాధించారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏ సీటు ను రాహుల్‌ వదులుకుంటారని చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో కూడా రాహుల్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి అమేథీలో ఓడిపోయి.. వయనాడ్‌లో గెలుపొందారు. ఈ సారి కూడా అలాగే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా సాగింది. అమేథీలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్.శర్మకు ఇచ్చారు. అనూహ్యంగా శర్మ ఇక్కడ భారీ విక్టరీ సాధించారు. ఇక ఈ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ లో నిలిచి... రెండు చోట్ల కూడా రాహుల్ గెలిచి రికార్డు క్రియేట్‌ చేశారు.

అంతేకాదు భారీ మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. కంచుకోటను వదులుకుంటారా? లేదంటే ఆపన్నహస్తం అందించిన వయనాడ్‌ను వదులుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. కంచుకోట రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీని దించాలని భావిస్తున్నారు. ప్రియాంక ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు మంచి అవకాశం వచ్చింది. వాస్తవానికి ఈ సీటు సోనియాగాంధీది. అయితే ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాబట్టి ఆ స్థానంలో ప్రియాంకను రంగంలోకి దించాలని అనుకుంటున్నారు.

ఇక రాహుల్.. రాయ్‌బరేలీలో 3 లక్షల ఓట్లకు పైగా.. వయనాడ్‌లో రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్‌ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచే రాహుల్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

Also read: చంద్రబాబుకు ఇండియా కూటమి బంపర్ ఆఫర్‌..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sitting: మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఏమౌతుంది?

జ్యోతిష శాస్త్రలో మంచం మీద భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి, రాహువు, బృహస్పతి గ్రహాలకు అసంతృప్తి కలుగుతుందని చెప్పబడింది. ఇది జీవితంలో శ్రేయస్సు, ధనం, ఆనందం వంటి అంశాలకు ప్రతికూలంగా పని చేస్తుంది. చెడు అలవాట్లు జీవితంలోని శుభతను తగ్గించగలవు.

New Update
eat sitting on bed

eat sitting on bed

Sitting: మన పూర్వీకులు చెబుతూ వచ్చిన అనేక నిబంధనల వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం దాగి ఉంటుంది. జీవితాన్ని సవ్యంగా కొనసాగించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మరియు మానసిక ప్రశాంతతను పొందడానికి కొన్ని ఆచారాలు, అలవాట్లు చాలా అవసరం. వీటిని పాటించడం వల్ల మనం అనేక రకాల శారీరక మరియు మానసిక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా మన అమ్మమ్మలు చిన్ననాటి నుంచే కొన్ని పనులను చేయవద్దని పలు మార్లు హెచ్చరిస్తూ ఉంటారు. వాటిలో మంచం మీద కూర్చొని భోజనం చేయడం ఒకటి. ఇది చాలామందికి ఓ చిన్న విషయం అనిపించవచ్చు కానీ, దీని వెనుక గల కారణాలు చాలా లోతుగా ఉంటాయి. మన శాస్త్రాలు, ఆచారాలు అన్నీ కూడా క్రమశిక్షణ, గౌరవం, పరిశుభ్రతలపై దృష్టి సారిస్తాయి.

ఆరోగ్యపరంగా..

పెద్దలు తినడానికి ముందు ఆహారానికి నమస్కరించడం, ప్లేట్‌ను శుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు కూడా ఆహార పట్ల గౌరవాన్ని వ్యక్త పరుస్తాయి. మంచం నిద్రించేందుకు ఉపయోగించే స్థలం, అది విశ్రాంతికోసం ఉద్దేశించబడింది. అటువంటి ప్రదేశంలో భోజనం చేయడం వల్ల ఆహారాన్ని అవమానించినట్లుగా భావించబడుతుంది. అది వరకే అపవిత్రతకు గురైన ప్రదేశం కావడం వల్ల, అక్కడ భోజనం చేయడం ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. జ్యోతిష శాస్త్ర దృష్టి కోణంలో చూస్తే, మంచం మీద భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి, రాహువు, బృహస్పతి గ్రహాలకు అసంతృప్తి కలుగుతుందని చెప్పబడింది. ఇది మన జీవితంలో శ్రేయస్సు, ధనం, ఆనందం వంటి అంశాలకు ప్రతికూలంగా పని చేస్తుందని విశ్వసించబడుతుంది. ఇటువంటి చెడు అలవాట్లు మన జీవితంలోని శుభతను తగ్గించగలవని మన పెద్దలు చెబుతుంటారు. 

ఇది కూడా చదవండి: మహిళల ఈ తప్పులు ప్రైవేట్ భాగాలకు హాని కలిగిస్తాయి

మరొక ముఖ్య కారణం ఆరోగ్యంతో కూడి ఉంటుంది. మనం డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తినడం లేదా నేలపై సూలభ్యంగా కూర్చొని తినడం వలన శరీర స్థితి సరిగా ఉంటుంది. శరీరం నిటారుగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. కానీ మంచం మీద లేదా సోఫాలో వంగి కూర్చొని తినడంవల్ల ఆహారం నేరుగా కడుపులోకి వెళ్లకుండా, కొంతమేర శ్వాసనాళాన్ని తాకే ప్రమాదం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగించవచ్చు, జీర్ణక్రియను మందగించవచ్చు. అందువల్లే అమ్మమ్మలు ఇలాంటి అలవాట్లను తప్పించమంటారు. ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద అర్థాన్ని కలిగి ఉంటాయి. మన దైనందిన జీవితంలో చిన్నగా కనిపించే ఈ అలవాట్లే మన ఆరోగ్యాన్ని, శ్రేయస్సును నిలబెట్టే కీలక మూలాలవుతాయి. కనుక మన పూర్వీకుల మాటలను తేలికగా తీసుకోవద్దు, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, అనుసరించడం ద్వారా మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో రాగులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?

( dinner | dinner-time | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

ఇది కూడా చదవండి: డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగవచ్చా?

Advertisment
Advertisment
Advertisment