Telangana Election: రాహుల్.. ప్రియాంకపై పోస్టర్ల కలకలం..వేషగాళ్లు అవసరమా అంటూ విమర్శలు

ఓట్ల వేషగాళ్ళు మనకు అవసరమా అంటూ వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. గిరిజన యూనివర్సిటీ, మేడారం జాతరకు జాతీయ హోదా, రామప్ప అభివృద్ధిపై రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఏనాడైనా మాట్లాడారా..? అంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్లు రాగానే ములుగులో వాలిపోతున్నారంటూ పోస్టర్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.

New Update

ములుగు జిల్లాలో రాహుల్‌ గాంధీ సభ సందర్భంగా పోస్టర్ల కలకలం రేపాయి. ఓట్ల వేషగాళ్ళు మనకు అవసరమా..? అంటూ విమర్శించేలా వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తి అతికించారు. మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ, రామప్ప అభివృద్ధిపై రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ఏనాడైనా మాట్లాడారా..? అంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్లు రాగానే ములుగులో వాలిపోతున్నారంటూ పోస్టర్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని దర్శించిన వారు ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులను స్వామివారి వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌, పొంగులేటి, సీతక్క తదితర నాయకులు, పార్టీ శ్రేణలు పాల్గొన్నారు.

నష్టమని తెలిసినా.. కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది

ములుగులో నిర్వహించిన విజయభేరీ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అనంతరం రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దొరలు, తెలంగాణ ప్రజల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామినీ ఎలా నెరవేర్చామో ప్రపంచం చూసిందని రాహుల్‌ అన్నారు. నష్టాలు కలిగించే నిర్ణయాలు పార్టీలు తీసుకోదు. కానీ.. తమకు నష్టం కలుగుతుందని తెలిసినా.. కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని రాహుల్‌గాంధీ తెలిపారు. బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఇది కూడా చదవండి: ఆంధ్రా అమ్మాయిల బతుకమ్మ అదుర్స్..గోదారోళ్ల బతుకమ్మ మామూలుగా లేదుగా

Advertisment
Advertisment
తాజా కథనాలు