Hyderabad Rains: గోడకూలి ఏడుగురి మృతి..నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు!

మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే  కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
Hyderabad Rains: గోడకూలి ఏడుగురి మృతి..నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు!

7 Died Due To Wall Collapse in Bachupally: మంగళవారం తెలంగాణలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు మునిగాయి. హైదరాబాద్‌ నగర ప్రజలు అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలింది. అక్కడే  కూలీలపై ఆ గోడ పడడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. బాచుపల్లి లో నూతనంగా నిర్మాణమవుతున్న హరిజాన్ కన్స్ట్రక్షన్ లో రోజూ కూలీలుగా పనిచేస్తున్నారని సమాచారం.

ఒక్కసారిగా ఈదురుగాలులతో పెద్ద వర్షం పడేసరికి హరిజాన్ వెంచర్ చుట్టూ ఉన్న ప్రహరీగోడ, ఇనుప రేకులు కూలిపోయి గోడకు ఆనుకొని ఉన్న గుడిసెలు పై పడటంతో నలుగురుకి గాయాలైయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు‌ కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు, శంకర్, రాజు, రామ్ యాదవ్, గీత, హిమాన్షు, ఖుషిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు సికింద్రాబాద్ -బేగంపేట్ ఓల్డ్ కస్టమ్ బస్తీలో రెండు చోట్ల నాల వరదనీటిలో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. దీంతో స్థానికులు బేగంపేట పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మృతదేహాలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో బయటికి తీసేందుకు చర్యలు చేపట్టారు.

నగరంలో కురిసిన భారీ వర్షం...

దాదాపు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షం కురిసింది..నగరంలో రికార్డు స్థాయిలో నమోదైనా వర్షపాతం..అత్యధికంగా కూకట్పల్లి లో 12 cm వర్షపాతం నమోదు అవ్వగా.. మియాపూర్,శెర్లింగంపల్లి లో 11 cm, చందనగర్, బాచుపల్లి, లింగంపల్లి లో 10 cmగచ్చిబౌలి, యూసఫ్ గూడా లో 9 cm, సికింద్రాబాద్ లో 8 cm, ఖైరతాబాద్, మూసాపేట్, షేక్ పేట్, , బాల్ నగర్ లో 7 cmనగరంలో చాలా ఏరియాలో 5 పైనే వర్షపాతం నమోదు అయ్యింది.

Also Read: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం… ఎప్పటి నుంచి అంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు