/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-11-1.jpg)
Wall Collapsed: మధ్యప్రదేశ్‌లో రేవాలోని గర్హ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అక్కడ సన్‌రైజ్ పబ్లిక్ స్కూల్ గేటు పక్కనే ఉన్న ఇంటి శిథిలావస్థలో ఉన్న గోడ కూలిపోవడంతో ఐదుగురు పిల్లలతో పాటు ఒక మహిళ చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా..మరొక విద్యార్ధికి, మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం రేవాలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.
చనిపోయిన పిల్లలు అందరూ ప్రవైటు స్కూలు అయిన సన్‌రైజ్ కు చెందిన వారే. స్కూలు అయిన తర్వాత ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు శిథిలాల నుండి పిల్లలను బయటకు తీసి చికిత్స కోసం గంగేవ్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ నలుగురు విద్యార్థులు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక విద్యార్థి, ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం రీవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర ప్రజాపతి, జిల్లా కలెక్టర్ ప్రతిభా పాల్, పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై సమాచారం అందుకున్నారు.