Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే!

సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటో, వీడియోలపై కొంతమంది వల్గర్ కామెంట్స్ చేస్తున్నారంటూ మృణాల్ ఠాకుర్ ఆందోళన వ్యక్తం చేసింది. 'హీరోయిన్లను వస్తువులుగా చూస్తున్నారు. మా ఫొటోలను రకరకాలుగా మార్చి పోస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది' అంటూ వాపోయింది.

New Update
Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే!

Mrinal Thakur: స్టార్ నటి మృణాల్ ఠాకుర్ సెలబ్రిటీలపట్ల నెటిజన్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది. అంతేకాదు తన అందం అభినయంలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుంటున్న మృణాలు సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగెటీవ్ కామెంట్స్ పై స్పందించింది.

చాలా బాధ కలిగిస్తుంది..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్ల ఫొటోలు, వీడియోలపై కొంతమంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నటీమణులను వస్తువులుగా చూస్తున్నారు. అంతేకాదు వారు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్‌ చేసి, వాటిని జూమ్‌ చేసి మరీ దారుణంగా వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఫొటోను రకరకాలుగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఈ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ప్రతి ఇంట్లోనూ మహిళలుంటారనే విషయం మరిచిపోకూడదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'హాయ్ నాన్న'తో మరోసారి విమర్శలకు ప్రశంసలు అందుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు