The Delhi Files : స్టార్ లతో మాకు పనిలేదు.. ‘ది ఢిల్లీ ఫైల్స్’ నుంచి వివేక్ బిగ్ అప్ డేట్! వివేక్ అగ్నిహోత్రి మరో కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చారు. ‘ది ఢిల్లీ ఫైల్స్’ వచ్చే సంవత్సరం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు. కంటెంట్ మాత్రం చాలా పెద్దది అంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు. By srinivas 22 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Star Director : బాలీవుడ్(Bollywood) స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన.. మరో కాంట్రవర్సీ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ మేరకు ‘ది ఢిల్లీ ఫైల్స్’ మూవీని వచ్చే సంవత్సరం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. BIG ANNOUNCEMENT: Is Mahabharat HISTORY or MYTHOLOGY? We, at @i_ambuddha are grateful to the almighty to be presenting Padma Bhushan Dr. SL Bhyrappa’s ‘modern classic’: PARVA - AN EPIC TALE OF DHARMA. There is a reason why PARVA is called ‘Masterpiece of masterpieces’. 1/2 pic.twitter.com/BiRyClhT5c — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 21, 2023 కంటెంట్ మాత్రం చాలా పెద్దది.. ఈ మేరకు ‘కొన్నేళ్లనుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం మొదలుపెట్టాను. ఫస్ట్ మూవీ ‘ది తాష్కంట్ ఫైల్స్‘తోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నా. రెండోది ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇక మూడోది ‘ది ఢిల్లీ ఫైల్స్’(The Delhi Files). ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు. కంటెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు కూడా అభిషేక్ అగర్వాలే నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వివేక్ ‘పర్వ’ మూవీతో బిజీగా ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాను మూడు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. #bollywood #vivek-agnihotri #the-delhi-files మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి