Chattisgarh CM: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌

ఛత్తీస్‌గడ్‌కు సీఎం ఎవరో అనే ఉత్కంఠకు తెర పడింది. విష్ణుదేవ్ సాయ్‌ను బీజేపీ అధిష్ఠానం సీఎంగా ప్రకటించింది. మరో కీలక నేత రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్‌ విష్ణుదేవ్‌ సాయ్‌కు అవకాశం ఇచ్చింది.

New Update
Chattisgarh CM: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌

ఛత్తీస్‌గడ్‌కు సీఎం ఎవరో అనే ఉత్కంఠకు తెర పడింది. విష్ణుదేవ్ సాయ్‌ను బీజేపీ అధిష్ఠానం సీఎంగా ప్రకటించింది. మరో కీలక నేత రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్‌ విష్ణుదేవ్‌ సాయ్‌కు అవకాశం ఇచ్చింది. బీజేపీ నుంచి ఎన్నికైన 54 కొత్త ఎమ్మెల్యేల సమావేశం రాయ్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం విష్ణుదేవ్ సాయి పేరును అధికారికంగా ప్రకటించారు. గిరిజన వర్గాల్లో విష్ణుదేవ్‌ బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రధాని మోదీ తొలి కేబినేట్‌లో కేంద్రమంత్రిగా, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే గత వారం రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కోసం బీజేపీ మంథనాలు కొనసాగుతున్నాయి. ఇక చివరికి పార్టీ పెద్దరు విష్ణు దేవ్ సాయ్ పేరును ప్రకటించాయి.

Also Read: ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది.. ‘ఉచిత’ పథకాలపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు నవంబర్ 7,17 వ తేదీన రెండు విడుతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలవగా.. బీజేపీ 54 స్థానాలకు దక్కించుకుంది. అయితే సీఎం పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌సింగ్‌కు మళ్లీ అధికారం వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ చివరికి రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టి విష్ణు దేవ్‌ సాయ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు బీజేపీ అగ్రనేతలు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి ఎవరిని చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల సీఎంల పేర్లు ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్.

Also Read: పంజాబ్‌ ని దేవుడే రక్షించాలి..భగవంత్‌ మాన్‌ కూతురి సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు