విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్నిప్రమాదంపై మరో కొత్త కోణం బయటపడింది. బెట్టింగ్‌ నేపథ్యంలో ఘర్షణ జరిగిందనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్‌ నాని పాత్రకూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.

New Update
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ అగ్నిప్రమాదంలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్‌ నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ జరిగిందనే విచారణ చెపట్టిన పోలీసులు ఇందుకు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాత్రి లంగర్ వేసిన బోటులో మద్యం పార్టీ జరిగిందని, ఇందులో ప్రముఖ యూట్యూబర్‌ నాని పాత్రకూడా ఉందని భావించిన అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రాత్రి 11:15 నిమిషాలకు బోట్ తగలబడినట్లు తెలుస్తుండగా సరిగ్గా 11:45 గంటలకు నాని హర్బర్ కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే బోట్ తగలబడుతుందనే సమాచారంతోనే అక్కడకు వచ్చినట్లు నాని చెబుతున్నాడని, తన భార్య సీమంతం కూడా అక్కడే నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.

Also read : పాదాచారులకు సుప్రీం కోర్టు షాక్.. అక్కడ నడవొద్దని వార్నింగ్

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా ఫోరెన్సిక్, రెవెన్యూ, ఫైర్, ఫిషరీస్, పోలీస్‌ విభాగాల అధికారుల బృందం కేసును పరిశీలించనున్నారు. అలాగే క్రైమ్,టాస్క్ ఫోర్స్, సీసీఎస్‌ స్పెషల్‌ టీమ్స్‌ ఈ విచారణలో పాల్గొననుండగా హార్బర్ ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇక హార్బర్‌లో ఈ ప్రమాదానికి అసాంఘిక శక్తులు కారణమై ఉండొచ్చని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ అంటున్నారు. 40 బోట్లు కాలిపోయాయని.. మరో 40 బోట్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనపై పూర్థిస్తాయిలో విచారణ చేపట్టినట్లు విశాఖ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా? అనే యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతోంది. అర్థరాత్రి పార్టీ జరిగే సమయంలో బోట్ల కొనుగోలు, అమ్మకాల విషయంలో వివాదం చెలరేగి మంటలకు కారణమై ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి యూ ట్యూబర్‌ నాని, అతని స్నేహితులే పనై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే వీళ్లంగా అక్కడికి ఎలా వెళ్లారనే కోణంలో సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen : లారీ కింద పడి.. పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్ సీసీ ఫుటేజ్!

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు.

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో షాకింగ్ సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.  చిల్లకల్ల టోల్ ప్లాజా వద్ద బైక్ పై నుంచి ప్రవీణ్ కింద పడ్డారు. మార్చి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తృటిలో లారీ టైర్ల కింద పడే ప్రమాదాన్ని ఆయన తప్పించుకున్నారు. ఆ సమయంలో వెనుక ఓ బస్సు కూడా వచ్చింది.  ఆ బస్సు డ్రైవర్ వెంటనే రైట్ తీసుకోవడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది.  వెంటనే కింద పడిన ప్రవీణ్ ను స్థానికులు పైకి లేపి కూర్చొబెట్టారు.  ఆ తరువాత కాసేపటికే బైక్ తీసుకుని రాజమండ్రి వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

Also read :  Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

509 గజాల ల్యాండ్ కొనుగోలు

2025 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఆయన రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదానిపై ఆర్టీవీ చేసిన ఇన్వేస్టిగేషన్ లో కీలక విషయాలు బయటపడ్డాయి.  రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ లపై కొనుగోలు చేశారు.  మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే విషయం తన భార్యతో పాటుగా ఆకాష్, జాన్ లకు మాత్రమే తెలుసు.  ఓ సేవ స్వంస్థతో పాటుగా అనాధ పిల్లల కోసం హాస్టల్ నిర్మించాలని ప్రవీణ్ ఈ 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది.  

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

Also read : Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!

Advertisment
Advertisment
Advertisment