ఓరి దుర్మార్గుడా.. కుక్క తోకకు పటాకులు కట్టి ఏం చేశాడో చూడండి

దివాళీ వేళ సంతోషంగా గడపాల్సింది పోయి ఓ యువకుడు కనికరం లేని పనిచేశాడు. ఓ కుక్క తోకకు క్రాకర్స్ కట్టి దానికి నిప్పట్టించాడు. దాన్నుంచి నిప్పులు రావడంతో ఆ కుక్క భయంతో పరుగులు తీసింది. ఆ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

New Update
Innocent Animal

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని సార్లు వారి ప్రయోగాలు బెడిసి కొట్టి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా అలాంటిదే జరిగింది. దివాళీ సందర్భంగా దేశవ్యాప్తంగా పటాసులతో సంబురాలు జరుపుకుంటున్నారు.

Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

కుక్క తోకకు క్రాకర్స్

ఈ నేపథ్యంలో ఓ యువకుడు చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దివాళీ వేళ సంతోషంగా గడపాల్సింది పోయి ఓ యువకుడు కనికరం లేని పనిచేశాడు. ఓ కుక్క తోకకు క్రాకర్స్ కట్టి దానికి నిప్పట్టించాడు. దాన్నుంచి నిప్పులు రావడంతో ఆ కుక్క భయంతో పరుగులు తీసింది. ఆ వీడియో వైరల్ కావడంతో యువకుడిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

Also Read : దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

దివాళీ వేళ ముంబైకి చెందిన ఓ యువకుడు కుక్క తోకకు క్రాకర్స్ కట్టాడు. ఆపై దానికి నిప్పంటించాడు. దీంతో ఆ క్రాకర్ పేలడంతో ఆ కుక్క భయంతో పరుగులు తీసింది. ఈ ఘటనలో ఆ కుక్కకు గాయాలైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read :  'అమరన్' ట్విట్టర్ రివ్యూస్.. చూస్తే షాకవుతారు!

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఆ యువకుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. నోరు లేని మూగ జంతువుపై కర్కశంగా ప్రవర్తించిన ఆ యువకుడిని పట్టుకోవాలని అంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరనేది తెలిసేంత వరకు వీడియోను షేర్ చేయాలని కోరుతున్నారు. 

Also Read :  రేవంత్‌ కుట్రలకు భయపడేది లేదు: KTR

అమాయకమైన కుక్కకు హాని కలిగించే ఇలాంటి దుర్మార్గపు పనిని కనికరం లేని యువత అడ్డుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా కుక్క తోకకు క్రాకర్స్ కట్టిన వ్యక్తికి కూడా అదే ట్రీట్ మెంట్ ఇవ్వాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే ఒక జంతువు బాధ తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ మేరకు పెటా ఇండియా సోషల్ మీడియా ఆ యువకుడి వివరాలు తెలియజేయాలని కోరింది. ఎవరికైనా ఆ యువకుడి వివరాలు తెలిస్తే.. 98201 22602కు కాల్ చేయండని తెలిపింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు