/rtv/media/media_files/2025/03/30/BHTR8f5YKTW9R8bz4UAd.jpg)
Transgenders Photograph: (Transgenders)
హిజ్రా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఐదారుగురు హిజ్రాలు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి రోడ్లపై, ట్రైన్‌లో, శుభకార్యాలకు వెళ్లి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు. బట్టలు విప్పి నానా హంగామా చేస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి చర్యలను చూసిచూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆదర్శ్ వర్మ గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు రెచ్చిపోయారు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడిపై దాడి చేసి చంపేశారు. మార్చి మొదటి వారంలో ఈఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also read: Kamareddy: పండగపూట విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి
भोपाल से विदिशा के बीच गंज बासौदा स्टेशन के पास होली के दिन चलती ट्रेन में एक वारदात ने दिल को दहला दिया, 12409 गोंडवाना एक्सप्रेस ट्रेन में किन्नरों ने एक युवक की पीट पीटकर जान ले ली और ट्रेन से बाहर फेंक दिया। @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw #railway @DrMohanYadav51 pic.twitter.com/EhpfcrzF1O
— Anil Kushwaha (@AnilKus61372462) March 21, 2025
ట్రైన్‌లోకి వచ్చిన హిజ్రాలు కంపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అందులో ఓ యువకుడు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తాను డబ్బులు ఇవ్వనని హిజ్రాలకు ఎదురు తిరగాడు. దీంతో ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్లు తమ దుస్తులు తీసేసి నానా రచ్చ చేశారు. అందరూ చూస్తుండగానే యువకుడిని చిత్తకొట్టారు. కింద పడేసి కాళ్లతో తన్నారు. ఇంత జరుగుతున్న ఒక్కరు కూడా హిజ్రాలను అడ్డుకోలేకపోయారు. ప్యాజింజర్లు అక్కడ జరిగేదంతా ఫోన్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసునవారు హిజ్రాలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులు ట్రాన్స్‌జెండర్లలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: BIG BREAKING: కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. రేవంత్ టీంలోకి మరో నలుగురు..?