/rtv/media/media_files/2025/04/02/QuzIOQFC6ETyNS4xhMkR.jpg)
viral video dog fell down on train tracks
Viral Video: ''కదులుతున్న రైలు ఎక్కడ ప్రమాదకరం'' అనే మాటను ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పాపం యజమాని అత్యుత్సాహం పెంపుడు కుక్క ప్రాణాల మీదకు తెచ్చింది. కళ్ళ ముందే కుక్క రైలు కింద పడడం చూసి షాకయ్యాడు. కంగారుతో అటు ఇటూ పరుగెత్తాడు.. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అసలు ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.
This is absolutely heartbreaking and shocking. As a dog parent myself, I can't even imagine putting my pet in such a dangerous situation. Trying to board a moving train with a dog is beyond irresponsible. Our pets trust us to keep them safe, and this kind of negligence is just… pic.twitter.com/RyZrCs6VXC
— Rahul (@am_rahulverma) April 2, 2025
రైలు కింద పడిన కుక్క
అయితే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి.. కుక్క రైలు, ప్లాట్ ఫార్మ్ మధ్యలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. కంగారుగా అటు ఇటు పరుగెత్తాడు. కానీ అప్పటికే కుక్క కింద పడిపోయి అరుస్తోంది. మరి ఇప్పుడు ఆకుక్క పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియదు. అదృష్టవశాత్తు కుక్క క్షేమంగా ఉండాలని కోరుకుందాం. యజమాని చేసిన తప్పు కుక్క ప్రాణాల మీదకు తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. , ‘‘అయ్యో.. తెలిసి తెలిసి కుక్కను చంపేశాడే’’.. అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు ‘కుక్కతో ఇలాంటి విన్యాసాలు చేయడం దారుణం.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మండిపడుతున్నారు.
latest-news | telugu-news | viral-video Dog Incident
Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!