వామ్మో ఆఫీసులో కునుకు తీశాడని.. ఇన్ని లక్షలు ఫైన్ హా?

చైనాలో ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆఫీస్‌లో గంట నిద్రపోయాడని ఉద్యోగంలో నుంచి తీసేశారు. దీంతో ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా.. అతనికి 3.5 లక్షల యువాన్లు జరిమానా విధించింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40.78 లక్షలు అన్నమాట.

New Update
Desk sleep

సాధారణంగా ఆఫీసులో నిద్రరావడమనేది కామన్. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతీ ఒక్కరికి నిద్ర వస్తుంటుంది. దీంతో కొందరు తెలియక ఆఫీసులో నిద్రపోతుంటారు. అయితే ఇలా గంటసేపు ఆఫీసులో కునుకు తీసిన ఓ ఉద్యోగికి కంపెనీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..  చైనాలోని టైజింగ్‌లోని ఓ కెమికల్ కంపెనీలో ఝాంగ్ అనే వ్యక్తి గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

గంట పాటు నిద్రపోయాడని..

ఆఫీస్‌లో బెస్ట్ ఎంప్లాయ్‌గా తనకి పేరు కూడా ఉంది. అయితే ఝాంగ్ నైట్ డ్యూటీ చేస్తూ టేబుల్‌పైన నిద్రపోవడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీంతో ఆ ఎంప్లాయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కంపెనీపై మండిపడింది. కేవలం గంట పాటు కునుకు తీస్తే.. ఈ మాత్రానికే ఉద్యోగంలో నుంచి తీసేస్తారా? అని మండిపడింది. 

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఎంప్లాయ్ గంట పాటు నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్ర జరిగిందని వాదించింది. అయితే ఎలాంటి నష్టం జరిగిందని కోర్టు వాదనలు వినిపించగా.. చివరికి జరిమానా విధించింది. చైనాల కరెన్సీలో 3.5 లక్షల యువాన్లు అనగా ఇండియన్ కరెన్సీలో రూ.40.78 లక్షలు కోర్టు జరిమానా విధించింది. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

ఇదిలా ఉండగా.. వర్క్ మధ్యలో కాస్త సమయం నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. కొంత సమయం కునుకు తీయడం వల్ల మైండ్ ఫ్రీ అయ్యి.. వర్క్ చేయగలరని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు