Vinesh Phogat : స్వదేశానికి వినేశ్‌ ఫోగాట్‌.. ఘనస్వాగతం పలికిన అభిమానులు!

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోసం చివరి వరకు పోరాడి వెనుదిరిగిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్ ఈ రోజు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆదరణ చూసి వినేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Vinesh Phogat : స్వదేశానికి వినేశ్‌ ఫోగాట్‌.. ఘనస్వాగతం పలికిన అభిమానులు!

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్ స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆదరణ చూసి వినేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది. ఆమెకు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులు అక్కడికి వెళ్లారు. కన్నీరు పెట్టుకున్న వినేశ్ ను ఓదార్చారు.

కన్నీరు పెట్టుకున్న వినేశ్..
ఈ మేరకు వినేశ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి బయటకు రాగానే బ్యాండ్ మేళం, పూలమాలలతో స్వాగతం పలికారు. కారులో ఊరేగింపుగా తీసుకెళుతుండగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేశ్ ను ఓదార్చారు. పారిస్ ఒలింపిక్స్‌ ఫైనల్‌కు చేరిన వినేశ్‌ 100 గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్ స్పోర్ట్స్‌(కాస్‌)లో అప్పీలు చేసినా ఆమె విజ్ఞప్తిని కాస్‌ కొట్టివేసింది. దీంతో పతకం లేకుండానే స్వదేశానికి వచ్చింది.

ఎప్పటికీ పోరాట యోధురాలే..
ఆమెపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘దేశంలో వినేశ్ పోరాటాన్ని అందరూ ఇష్టపడతారు. ఈ అపూర్వ స్వాగతం దానికి చక్కటి ఉదాహరణ’ అన్నారు. బజరంగ్‌ పునియా. ఇక ‘ఆమె దేశం కోసం ఏమి చేసిందనేది అందరికీ తెలుసు. ఇలాంటి సాహసం తక్కువ మంది మాత్రమే చేయగలరు. ప్రశంసలు, గౌరవానికి వినేశ్ సంపూర్ణ అర్హురాలు’ అని సాక్షి మలిక్ కొనియాడారు. ‘వినేశ్‌ ఫోగాట్ మనందరి ఛాంపియన్. ఎప్పటికీ పోరాట యోధురాలే. ఆమెను విజేతగానే భావిస్తున్నాం. మన దృష్టిలో ఆమె స్వర్ణ పతకం సాధించినట్లే' అని సత్యవర్త్‌ కడియన్ అన్నారు.

Also Read : దమ్ముంటే డేట్, ప్లేస్ చెప్పు.. రేవంత్‌కు హరీష్ రావు మరో సంచలన సవాల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు