Vinesh Phogat: నేను పోరాడుతా.. అనర్హత వేటుపై తొలిసారిగా స్పందించిన వినేశ్ ఫొగాట్.. పారిస్ ఒలింపిక్స్‌లో డిస్‌క్వాలిఫై అవ్వడంపై తొలిసారిగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పందిచారు. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను ఎగరవేయాలనుకున్నానని, దాని పవిత్రతను పునరుద్ధరించాలనుకున్నానని.. కానీ సమయం ప్రతికూలంగా మారిందని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. By B Aravind 16 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పారిస్ ఒలంపిక్ గేమ్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 50 కిలోల విభాగంలో పోటీ చేయనున్న వినేశ్.. 100 గ్రాములు అధిక బరువు ఉన్న కారణంగా ఆమెను డిస్‌క్వాలిపై చేశారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలామంది ఆమెకు ఇలా జరగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వినేశ్.. సిల్వర్ పతకం సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రయత్నించింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో అప్పీల్ చేసినప్పటికీ కూడా ప్రయత్నాలు ఫలించలేదు. సీఏఎస్ వినేశ్ అప్పీల్‌ను కొట్టివేసింది. Also Read: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ అప్పటి నుంచి వినేశ్ ఫొగాట్.. తాను డిస్‌క్వాలిఫై అయిన ఘటనపై మౌనంగానే ఉన్నారు. అయితే తాజాగా శుక్రవారం దీనిపై స్పందిచారు. మూడు పేజీలతో ఉన్న ఒక లాంగ్ పోస్టును ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టులో ఆమె తన అభిప్రాయలను పంచుకున్నారు. ' రెజ్లర్ల నిరసన జరుగుతున్న సమయంలో నేను భారత మహిళల పవిత్రతను, జాతీయ జెండా విలువలను కాపాడేందుకు గట్టిగా పోరాడాను. కానీ 2023, మే 28 నుంచి.. నేను జాతీయ జెండాతో దిగిన ఫొటోను ఎవరైనా చూస్తుంటే.. బాధ నన్ను వెంటాడింది. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను ఎగరవేయాలనుకున్నాను. జాతీయ జెండాతో కలిసి నేను దిగే ఫొటోతో దాని విలువను, పవిత్రతను పునరుద్ధరించేలా ప్రతిబింబింపజేయాలనుకున్నాను. నేను పరిస్థితులకు లొంగిపోలేదు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పడు బహుశా మళ్లీ నేను మాట్లాడుతాను. ఆగస్టు 6న రాత్రికి, ఆగస్టు 7న ఉదయం నేను చెప్పాలనుకుంది ఒక్కటే.. మేము విరమించలేదు, మా ప్రయత్నాలను ఆపలేదు, మేము లొంగిపోలేదు. కానీ సమయం ఆగిపోయింది. అది ప్రతికూలంగా మారింది. ఇది నా విధి. నా టీమ్‌కు, నా భారత ప్రజలు, నా కుటుంబ సభ్యులకు మనం సాధించాలనుకుంది పూర్తి చేయలేకపోయామని అనిపిస్తోంది. ఏదో కోల్పోయినట్లుగా ఉంటోంది. కానీ ఇది ఎప్పటికీ ఇలా మళ్లీ ఉండకపోవచ్చు. బహుశా కొన్ని పరిస్థితుల వల్ల.. నేను 2032 వరకు రెజ్లింగ్ చేయవచ్చు. నా పోరాటం, రెజ్లింగ్ ఎప్పటికీ నాలో ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో, తర్వాతి ప్రయాణం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. కానీ నేను నమ్మేదాని కోసం, సరైన దాని కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటాను'' అని వినేశ్ ఫొగాట్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. pic.twitter.com/8iu2vs21Wq — Vinesh Phogat (@Phogat_Vinesh) August 16, 2024 #2024-paris-olympics #vinesh-phogat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి